Revanth Reddy : కాంగ్రెస్ లో పెరుగుతున్న రేవంత్ వర్గం.. ఆయన చెప్పిందే వేదం..!

Qubetvnews - March 22, 2024 / 09:44 AM IST

Revanth Reddy : కాంగ్రెస్ లో పెరుగుతున్న రేవంత్ వర్గం.. ఆయన చెప్పిందే వేదం..!

Revanth Reddy : రేవంత్ రెడ్డి గ్రాఫ్‌ రోజు రోజుకూ కాంగ్రెస్ లో పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే మొన్నటి వరకు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన్ను వ్యతిరేకించిన వారే.. ఇప్పుడు రేవంత్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రేవంత్ ఏం చేసినా ఎవరూ అడ్డు చెప్పేందుకు ధైర్యం చేయట్లేదు. అంతే కాకుండా రేవంత్ చేసే పనులను మెచ్చుకోవాల్సిందే అన్నట్టు వారి వ్యవహారం ఉంది. ఇక రాజకీయాంగా ఇప్పుడు రేవంత్ వర్గం కాంగ్రెస్ లో మరింత పెరుగుతోందని అంటున్నారు. ఇప్పుడు ఎంపీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ లోకి చాలా మంది నేతలు వస్తున్నారు.

అయితే ఇలా బయట పార్టీల నుంచి వస్తున్న ప్రతి ఒక్కరూ ముందుగా వెళ్లి రేవంత్ నే కలుస్తున్నారు. రేవంత్ ఇచ్చే హామీల మీదనే వారు కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అంతే తప్ప రేవంత్ ను కాదని ఇంకా ఏ మంత్రులను కవలవట్లేదు. ఏ మంత్రి హామీలను కూడా పట్టించుకోవట్లేదు. అందుకే ఇప్పుడే రేవంత్ రెడ్డి వర్గం కాంగ్రెస్ లో పెరుగుతుందనే చెప్పుకోవాలి వాస్తవానికి రేవంత్ రెడ్డిని మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉండగా చాలామంది కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకించారు. ఆయన మీద అధిష్టానానికి ఫిర్యాదు లేఖలు కూడా రాశారు.

కానీ రేవంత్ మాత్రం ఎన్నడూ పార్టీలో కల్లోలం సృష్టించలేదు. కేవలం అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ ను టార్గెట్ చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేసి చివరకు సక్సెస్ అయ్యారు. దాంతో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గ్రాఫ్‌ పార్టీలో బాగా పెరుగుతోంది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ లోకి వస్తున్న వారందరూ కూడా పెద్ద లీడర్లే. అంతే కాకుండా ఆర్థికంగా వారు చాలా బలమైన వ్యక్తులు. అంతే కాకుండా పెద్ద సామాజిక వర్గాలకు చెందిన నేతలు కావడం ఇక్కడ విశేషం. అందుకే ఇప్పుడు వారందరూ కూడా రేవంత్ రెడ్డి వర్గంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు.

వారు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్నా సరే రేవంత్ రెడ్డి మాటనే వింటామని ఇన్ డైరెక్టుగా చెప్పేస్తున్నారు. ఇక రేవంత్ కూడా వారికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. ఇప్పటికే పార్టీలోకి వచ్చిన రంజిత్ రెడ్డి, దానం నాగేందర్, సునీత మహేందర్ రెడ్డిలకు ఎంపీ టికెట్లు కేటాయించారు.

అంతే కాకుండా ఇంకొంతమందికి నామినేటెడ్ పోస్టులను హామీ ఇచ్చారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి కసరత్తులు చేస్తున్నారు ఇలా తనను నమ్ముకుని వచ్చిన వారికి ప్రభుత్వంలో కీలక పదవులు ఇస్తున్నారు. ఇలా రేవంత్ తన వర్గాన్ని కాంగ్రెస్ పార్టీలో, ఇటు ప్రభుత్వంలో పెంచుకుంటూ తనకు తిరుగులేకుండా చేసుకుంటున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News