Revanth Reddy : ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేవంత్ ప్రత్యేక వ్యూహం..!

Qubetvnews - March 26, 2024 / 09:31 AM IST

Revanth Reddy : ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేవంత్ ప్రత్యేక వ్యూహం..!

Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రతి ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇంతకు ముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి.. ఎన్నికల్లో ఒంటరి పోరు సాగించారు. కానీ ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్లు అందరూ రేవంత్ కే జై కొడుతున్నారు. రేవంత్ ఏం చేసినా దానికి సపోర్టుగానే నిలుస్తున్నారు. అటు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా రేవంత్ కే ఎంపీ ఎన్నికల బాధ్యతలను తెలంగాణలో అప్పగించారు. దాంతో ఇప్పుడు రేవంత్ రెడ్డికి అటు ఎంపీ ఎన్నికలతో పాటు పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నిక కూడా చాలా కీలకంగా మారిపోయింది.

ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఉమ్మడి పాలమూరుకు చెందిన జిల్లా వాసి. అందుకే తన జిల్లాలో వస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికను ఎలాగైనా గెలిచి తీరాలని ఆయన పట్టుదలగా పెట్టుకున్నారు. ఇక్కడ స్థానిక సంస్థల ఓటర్లు 1439 ఉన్నాయి. ఇందులో బీఆర్ ఎస్ కు 850 స్థానిక సంస్థల ఓట్లు ఉన్నాయి. అటు కాంగ్రెస్ కు 350, బీజేపీకి 150 ఓట్లు ఉన్నాయి. ఇతరులు మిగతా వాళ్లు ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ ఎస్ నుంచి నవీన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికలు వారికి సవాలుగా మారాయి.

అయితే కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు ఉన్నా సరే.. ఇప్పుడు రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు. బీఆర్ ఎస్ లో ఉన్న చాలా మంది స్థానిక సంస్థల ఓటర్లు ఆ పార్టీ మీద ఆగ్రహంగా ఉన్నారు. గత ఐదేండ్లుగా ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో పాటు ఈ సారి టికెట్ రాదని.. ఒకవేళ వచ్చినా సరే గెలిచే అవకాశాలు లేవని వారు నమ్ముతున్నారు. అందుకే వారితో ఇప్పుడు ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఉమ్మడి పాలమూరులో 14 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే.. అందులో 12 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు బీఆర్ ఎస్ స్థానిక సంస్థల ఓటర్లతో మంతనాలు జరుపుతున్నారంట.

ఇప్పటికే చాలా మంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ల హామీలతో పాటు మరికొందరికి ఇతర హామీలు ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దాంతో పాటు బీఆర్ ఎస్ లో ఉన్న ఇతర నేతలకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కొన్ని హామీలు ఇస్తున్నారు.

బీఆర్ ఎస్ మునిగిపోతున్న పడవ అని.. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ హవానే ఉంటుందని.. అందుకే కాంగ్రెస్ లోకి రావాలని.. మీకు మంచి భవిష్యత్ ఉంటుందని మంతనాలు జరుపుతున్నారంట. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News