Revanth Reddy : టార్గెట్ యూత్.. రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్ షురూ..!
Qubetvnews - April 5, 2024 / 09:50 AM IST
Revanth Reddy : యువత తలచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. ప్రభుత్వాలేతారుమారు అయిపోతాయి. అందుకే అన్ని పార్టీలు కూడా యూత్ ను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు యూత్ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓడిపోవడానికి కూడా ప్రధానంగా యూత్ కారణం అయింది. ఎందుకంటే చాలా మంది యూత్ లో బీఆర్ ఎస్ మీద వ్యతిరేకత ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడం అలాగే వేసిన నోటిఫికేషన్లు కూడా వరుసగా ఎగ్జామ్స్ రద్దు కావడం లాంటివి యూత్ లో తీవ్ర అసంతృప్తిని పెంచాయి.
దాంతో కాంగ్రెస్ ఆ ఓట్లు మళ్లడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత యూత్ ను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే వరుసగా నోటిఫికేషన్లు వేశారు. దాంతో పాటు గతంలో ఎగ్జామ్స్ జరిగి పోస్టింగ్ ఆగిపోయిన అభ్యర్థులకు ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు. ఇప్పుడు మరో నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. అదేంటంటే ఫీజుల నియంత్రణ. ఇప్పుడు స్కూళ్లు, కాలేజీల్లో ఏ రేంజ్ లో ఫీజులు తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కార్పొరేట్ కాలేజీల్లో అడ్డూ, అదుపు లేకుండా ఫీజులు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వీటికి కళ్లెం వేయలేకపోయారు. దాంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి.. వీటికి కళ్లెం వేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాంగానే ఫీజుల నియంత్రణ కోసం ఓ చట్టం తేబోతున్నట్టు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికలు అయిపోయిన వెంటనే అసెంబ్లీ వేదికగా బిల్లు తీసుకువస్తారని అంటున్నారు. టెన్త్ వరకు ఏ స్థాయిలో ఫీజులు తీసుకోవాలి, ఇంటర్ కు ఎలా, డిగ్రీ, పీజీతో పాటు ఇతర పెద్ద చదువులకు ఎంత ఫీజులు తీసుకోవాలనేది అందులో ఉండబోతోందంట.
ఈ విషయంపై ఇప్పటికే ప్రత్యేకంగా చర్చలు కూడా జరుపుతున్నారంట రేవంత్ రెడ్డి. గతంతో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ కు అటు యూత్ లో కూడా మద్దతు పెరుగుతోంది. మొన్నటి వరకు బీజేపీకి పెద్ద ఎత్తున యూత్ లో క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు వారంతా కూడా కాంగ్రెస్ కు మళ్లుతున్నారు.
అందుకే ఇప్పుడు కాంగ్రెస్ కు పెద్ద ఎత్తున యూత్ లో మద్దతు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇలాంటి ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చే పనిలో పడ్డారంట రేవంత్ రెడ్డి. చూడాలి మరి ఆయన ప్రయత్నం ఏ మేరకు వర్కౌట్అవుతుందో.


