Brs Mlas: ఆ 13 మంది పార్టీ మారుతారా.. కేటీఆర్ పిలిచినా ఎందుకు రాలేదు..?
Qubetvnews - July 18, 2024 / 04:55 PM IST
Brs Mlas : బీఆర్ ఎస్ కు రోజు రోజుకూ గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. పార్టీ ఓడిపోవడం అతిపెద్ద మైనస్ అయిపోయింది. గింజలన్నీ అయిపోగానే పక్షులన్నీ ఎగిరిపోతాయి అన్నట్టు.. అధికారం ఇలా పోగానే.. ఉన్న నేతలంతా వెళ్లిపోతున్నారు బీఆర్ ఎస్ నుంచి. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. ఇంకా మిగిలిన వారు కూడా వెళ్లిపోతారనే ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే దీనికి కారణాలు కూడా ఉన్నాయి. బీఆర్ ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇస్తారేమో అని మంత్రులు కూడా ఎదురు చూసి విసిగిపోయారు.
కేసీఆర్ ను కలవడానికి వెళ్తే ప్రగతి భవన్ గేట్ల దగ్గర ఆగిపోయామని ఈటల రాజేందర్ లాంటి వారో ఆరోపించారు. ఎమ్మెల్యేలకు అప్పట్లో కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా దొరికేది కాదని ఎంతో మంది చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పులు కలిసి పనిచేద్దాం.. ఒక మీటింగ్ పెడుదాం అంటే కూడా ఎవరూ పెద్దగా రావట్లేదు. కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడినా సరే ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉండట్లేదు. అందరూ వెళ్లిపోతున్నారు. అయితే మొన్న ఎమ్మెల్యేల ఫిరాయింపులు, ప్రొటోకాల్ విషయంలో స్పీకర్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్దామని కేటీఆర్ అన్నారు.
ఎమ్మెల్యేలకు కబురు పంపారు. అయితే కేసీఆర్ తర్వాత బీఆర్ ఎస్ లో అంత పవర్ ఫుల్ లీడర్అ యిన, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ పిలిచినా సరే ఎమ్మెల్యేలు మాత్రం వెళ్లట్లేదు. ఇప్పుడు పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 14 మంది రాలేదు. కేసీఆర్ ను విడిచిపెడితే మిగిలిన 13 మంది ఎందుకు రాలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. వీరిలో మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఎక్కువగా హైదరాబాద్ లో ఉన్న వారే ఉన్నారు. ఇతర జిల్లాలనుంచి హైదరాబాద్ కు వచ్చి కేటీఆర్ తో వెళ్లారు. కానీ హైదరాబాద్ లోనే ఉంటే.. రాలేకపోయారు.
దాంతో వీరు ఉంటారా.. పార్టీని వీడుతారా అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. అసలు వీరెందుకు రాలేదు అంటే.. ఇప్పటికే కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారనే ప్రచారాలు తెరమీదకు వస్తున్నాయి. దాంతో అసలు వీరు కూడా ఎప్పుడు జంప్ అవుతారో అనే టెన్షన్ కేసీఆర్ కుటుంబంలో ఉందంట.





