Botsa Jhansi Lakshmi : విశాఖ పురోభివృద్ధికి ఫ్యాన్ గుర్తుపై ఓటెయ్యండి : బొత్స ఝాన్సీ

Qubetvnews - April 30, 2024 / 08:46 AM IST

Botsa Jhansi Lakshmi : విశాఖ పురోభివృద్ధికి ఫ్యాన్ గుర్తుపై ఓటెయ్యండి : బొత్స ఝాన్సీ

Botsa Jhansi Lakshmi :

విశాఖపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారంలో దూసుకు పోతున్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు అసెంబ్లీ సెంగ్మెంట్లలో బొత్స ఝాన్సీ ప్రచారం నిర్వహించారు. ఆ సందర్భంగా సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ రాష్ట్రంలో మళ్లీ జగన్‌ సీఎం అవ్వాల్సిన ఆవశ్యకత ను వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. తాను గెలిస్తే విశాఖ పట్నం కు ఏం తీసుకు వచ్చేది, జగన్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే చేసే పనుల గురించి ఝాన్సీ వివరిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. ప్రచార హోరు, ప్రజల మద్దతు చూస్తూ ఉంటే విశాఖ లో కచ్చితంగా వైకాపా జెండా ఎగరడం ఖాయం అనిపిస్తుంది.

విశాఖపట్నం పూర్ణ మార్కెట్‌ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ… ప్రతి పేదవాడికి అండగా ఉంటూ, అంబేద్కర్ కలలు కన్న సామాజిక సాధికారతను, మహిళలకు సముచిత ప్రాధాన్యమిస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తాను పుట్టిన ప్రాంతానికి సేవ చేసే అవకాశం కల్పించాలని, పార్లమెంటు అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. అమ్మఒడి కింద చెల్లిస్తున్న 15 వేల మొత్తాన్ని 17 వేలకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా నవరత్న పథకాలను అమలు చేస్తామన్న వాగ్ధానం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

విశాఖ పురోభివృద్ధికి ఫ్యాన్ గుర్తుపై ఓటెయ్యండి. విప్లవాత్మకమైన సంస్కరణలతో పేదలకు ఉన్నత స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ,మెరుగైన ఆరోగ్య వసతులను కల్పిస్తున్న జగన్ గారి పాలనను ఒకసారి పరిశీలించాలని, మన అందరి అభ్యున్నతే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తూ, విశాఖ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పరిపాలన రాజధానిగా చేస్తామని చెపుతున్న వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఆమె పిలుపునిచ్చారు.

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం జరిగిన కళింగ ఆత్మీయ సమ్మేళనంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించారన్నారు. కలింగ సామాజిక వర్గానికి ఒక ఎంపీ 3 ఎమ్మెల్యే పదవులతో పాటు విశాఖ వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ పదవిని ఇచ్చామని ఆయన చెప్పారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ప్రకటించి ఉత్తరాంధ్ర పై ముఖ్యంగా విశాఖపై జగన్మోహన్ రెడ్డి వల్లమాలిన ప్రేమ చూపించారని దీనితో విశాఖ గ్లోబల్ మెగాసిటీగా అభివృద్ధి చెందుతుందన్నారు.

జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనతో విశాఖపట్నం నీతి అయోగ్ గ్రోత్ సిటీగా నాలుగవ స్థానంలో ఉందన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి మొట్టమొదటిసారి ప్రాధాన్యత నిచ్చినది వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని అన్నారు. సంక్షేమ అభివృద్ధిలను రెండు కళ్ళగా తీసుకుని నవరత్నాలతోపేదల కుటుంబాల్లో వెలుగులు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు.

 

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News