Botsa Jhansi Lakshmi : ఆరోగ్యశ్రీ పథకంతో పేదల జీవితాల్లో వెలుగులు : బొత్స ఝాన్సీ

Qubetvnews - May 6, 2024 / 09:06 AM IST

Botsa Jhansi Lakshmi : ఆరోగ్యశ్రీ పథకంతో పేదల జీవితాల్లో వెలుగులు : బొత్స ఝాన్సీ

Botsa Jhansi Lakshmi :

విశాఖపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి రోజు పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, జగన్ మళ్లీ సీఎం అయితే తీసుకు వచ్చే పథకాలు, చేసే అభివృద్దిని గురించి వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ… విశాఖను, ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లి, వెనకబాటు తనాన్ని దూరం చేసేందుకు కట్టుబడి ఉన్న మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మరోసారి సిఎంగా చేసుకోవాడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛంధంగా ముందుకు రావాలని విశాఖ పార్లమెంటు అభ్యర్ధి శ్రీమతి బొత్స ఝాన్సీ కోరారు.

విశాఖపట్టణం ప్రజలంతా తమ కుటుంబమనీ, ఆ కుటుంబమే తన బలమని వారే తనకండగా ఉంటారని పార్లమెంటు అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ఈ ప్రాంతం నుంచి పోటీ చేసే అవకాశమిచ్చి, పుట్టినింటికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి అండగా ఉంటూ తనను ఓటు రూపంలో ఆశీర్వదించాలని ఆమె అభ్యర్దించారు. కన్నవారి ప్రాంతంలో జరుగుతున్న సమావేశంలో పాల్గొనడం సంతోషదాయకంగా ఉందన్నారు. అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ, అనునిత్యం వారి సేవలోనే ఉండే తనకు ఓటు వేయాలని కోరారు. బిసిలంటే వెనకబడిన వర్గాలు కాదని, బ్యాక్ బోన్ వర్గాలంటూ నిర్ధిష్టంగా ప్రకటించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వారికి అన్ని విధాలుగా ప్రాధాన్యత నిస్తున్నారని, అందులోనూ రాజకీయంగా కూడా అవకాశాలు కల్పిస్తూ వారి ఉన్నతికి దోహదం చేస్తున్నారని, అందులో భాగంగానే బిసి మహిళనైన తనకు పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం లభించిందన్నారు.

ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా వృధ్ది చెందాలన్న తపనతో పనిచేస్తూ, విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తానని ప్రకటించారన్నారు. విశాఖ ప్రజలకు లభించిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని, జగన్ మోహన్ రెడ్డి గారికి, వైయస్ఆర్సీపీ కి అండగా ఉంటూ ఉత్తరాంధ్రకు గుండెకాయలాంటి విశాఖను లక్ష కోట్ల రూపాయల ప్రణాళికతో రూపొందించిన విజన్ తో సంపూర్ణంగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ విషయంలో పొరపాటు చేస్తే తీవ్రంగా నష్టపోతామని ఆమె హెచ్చరించారు.రాష్ట్రంలోని ప్రతి ప్రతి కుటుంబానికి విద్యా, వైద్యం మౌలిక సదుపాయాలు అందించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని శ్రీమతి బొత్స ఝాన్సీ అన్నారు.

మానవసేవే మాధవసేవగా విస్తృతమైన సేవలు అందించే వైద్యవృత్తిని మించి ఉత్తమమైనది లేదని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి బొత్స ఝాన్సీ అన్నారు. విశాఖపట్నంలోని ఆమ్కోస్ లో ఆదివారం ఉదయం నిర్వహించిన డాక్టర్ల ఆత్మీయ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు అనేక మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపితే దానిని మరింతగా విస్తరించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం తన ప్రధాన కర్తవ్యాల్లో ఒకటిగా చేసుకుని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పని చేస్తున్నారని ఆమె అన్నారు.

ఆరోగ్యశ్రీ పరిధిలోకి విస్తారంగా వైద్య సేవలను చేర్చి, ఆర్థిక పరిమితిని 25 లక్షల పెంచుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాసేవకు కొత్త నిర్వచనం పలికారని పేర్కొన్నారు.
విశాఖ ను పూర్తి స్థాయి హెల్త్ సిటీగా తీర్చిదిద్ది ఉత్తరాంధ్ర ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి అపారమని అన్నారు. ఐదేళ్ల కాలంలో 17 వైద్య కళాశాలలు నెల కొల్పడంతోపాటు, ఒక్క వైద్యరంగం, దాని అనుబంధం రంగాల్లోనే లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి గారిదేనని వివరించారు. పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంగా విశాఖను పరిపాలన రాజధాని చేసుకుంటే ఉత్తరాంధ్ర స్వరూపమే మారిపోతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మనమంతా అండగా ఉండాలని ఆమె కోరారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News