Botsa Jhansi Lakshmi : చెప్పింది చేసి చూపించిన జగన్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాం : బొత్స ఝాన్సీ
Qubetvnews - April 29, 2024 / 09:50 AM IST
Botsa Jhansi Lakshmi :
విశాఖపట్నం పార్లమెంట్ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారంలో స్పీడ్ పెంచారు. స్థానిక నాయకులు, కార్యకర్తలను కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గత అయిదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలను వివరిస్తూనే అధికారంలోకి వస్తే రాబోయే అయిదు సంవత్సరాల్లో చేయబోతున్న అభివృద్ది మరియు సంక్షేమ పథకాల అమలు గురించి బొత్స ఝాన్సీ వివరించారు. చెప్పింది చేసి చూపించే ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాం, పేదవారి ఉన్నతికి వేసిన బాటలను పటిష్టం చేసుకుందాం అంటూ బొత్స ఝాన్సీ గాజువాక లో జరిగిన రెడ్డి సోదరుల ఆత్మీయ సమావేశంలో బొత్స ఝాన్సీ పాల్గొన్నారు.
ఆ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ.. చెప్పింది చేసి చూపించి, ప్రజా పరిపాలనా అజెండాగా పరిపాలన అందిస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో చెప్పింది చేయకుండా, ఇప్పుడు కొత్తగా ఏదో చేసేస్తామంటూ వస్తున్న విపక్షాలకు ఎన్నికల్లో బుద్ది చెప్పాలని , వారు చేస్తున్న దుష్ప్రచాలను తిప్పికొట్టాలని అన్నారు. ఎంపి వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్ నాధ్ తదితరులతో కలిసి గాజువాక లో రెడ్డి సోదరుల ఆత్మీయ సమావేశంలో బొత్స ఝాన్సీ పాల్గొన్నారు. ఎందరో త్యాగాలతో సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అందుకు తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కులం, మతం, పార్టీలు చూడకుండా పేదవాడి సంక్షేమమే అందిస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని మరోసారి ముఖ్యమంత్రిగా చేద్దామని ఆమె పిలుపునిచ్చారు.
బొత్స అంటే భరోసా.. కష్టం చెప్పుకుంటే తీరిపోతుంది అనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాం. చేయగలిగిందే చెబుతాం. చెప్పింది చేసి ధైర్యంగా ఓటు అడుగుతాం. జగనన్న మాట ఇస్తే తగ్గేదేలే అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి దోహదపడేలా పార్టీ మానిఫెస్టో ఉన్నదని దానిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని శ్రీమతి బొత్స ఝాన్సీ కార్యకర్తలను కోరారు. విశాఖ తూర్పు నియోజకవర్గం వెంకోజిపాలెం లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ యజ్ఞం కొత్తపుంతలతో ముందుకు సాగాలంటే మరోసారి గెలిపించుకోవాల్సి అవసరం చాలా ఉందన్నారు. ఆయన ప్రతినిధులగా ఎన్నికల్లో ఎంపీగా తనను, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎం వి. సత్యనారాయణ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. లక్ష కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన విజన్ విశాఖ సాకారం చేసుకుందామని , మన ప్రాంతాన్ని పరిపాలనా రాజధాని గా చేసుకుందామన్నారు. వైకాపా గెలుపుతోనే విశాఖ ప్రజల కలలు నెరవేరుతాయి అంటూ ఝాన్సీ పేర్కొన్నారు.





