Botsa Jhansi Lakshmi : భారీ ర్యాలీ, అభిమానుల సందడి మధ్య బొత్స ఝాన్సీ లక్ష్మీ నామినేషన్……………..
Qubetvnews - April 23, 2024 / 09:34 AM IST
Botsa Jhansi Lakshmi :
వైసీపీ జెండాలు, అభిమానుల జయధ్వానాలు, కార్యకర్తల సంబరాలు, నేతల ఆత్మీయ పలకరింపులతో సందడి మధ్య నామినేషన్ వేశారు బొత్స ఝాన్సీ లక్ష్మీ . విశాఖ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు పార్టీ ఆఫీసు నుంచి ర్యాలీగా బయలుదేరారు ఝాన్సీ లక్ష్మీ. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, ముత్తంశెట్టి శ్రీనివాస్, అమర్నాథ్ కూడా హాజరయ్యారు. దారి వెంట కార్లు, బైకులతో, జగనన్న జెండా రెపరెపలతో, ఆట పాటల హోరుతో కన్నుల పండుగగా జరిగింది ర్యాలీ.
అనంతరం నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు ఝాన్సీ లక్ష్మీ. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు, వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థిగా మహిళకు అవకాశమిచ్చిన జగనన్నకి ధన్యవాదాలు తెలిపారు ఝాన్సీ లక్ష్మీ.
వైసీపీ పాలన వల్ల మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఓటేయండి అని నిజాయితీగా ఓట్లడుగుతన్న జగనన్నకే ప్రజలు మళ్లీ పట్టం కడతారనీ, జగన్ మళ్లీ ముఖ్యమంత్రయితే విశాఖ పరిపాలనా రాజధానిగా మారి యువతకి బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి, మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేసిన జననేతగా జగన్ మళ్లీ సీఎం అవుతారనీ, ప్రజల ఆశీస్సులున్నయనీ తెలిపారు ఝాన్సీ లక్ష్మీ.





