Botsa Jhansi Lakshmi : విశాఖను అత్యుత్తమ మహానగరంగా తీర్చిదిద్దే సంకల్పం : బొత్స ఝాన్సీ

Qubetvnews - May 2, 2024 / 10:47 AM IST

Botsa Jhansi Lakshmi : విశాఖను అత్యుత్తమ మహానగరంగా తీర్చిదిద్దే సంకల్పం : బొత్స ఝాన్సీ

Botsa Jhansi Lakshmi :

విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న మద్దతు మరియు సహకారం నేపథ్యంలో బొత్స ఝాన్సీ మరింత స్పీడ్‌ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు ఎక్కువ సమయం ప్రచారం చేస్తున్నారు. ఏపీ అభివృద్ది మరియు సంక్షేమంలో ముందుకు వెళ్లాలి అంటే కచ్చితంగా జగన్‌ మళ్లీ సీఎం అవ్వాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. వైజాగ్‌ రాజధాని అయితేనే ఉత్తరాంధ్ర అభివృద్ది చెందుతుందని బొత్స ఝాన్సీ అన్నారు.

మే డే సందర్భంగా లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బొత్స ఝాన్సీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఝాన్సీ గారు మాట్లాడుతూ… ప్రతి కుటుంబానికి మేలు చేయాలన్న తపనతో మన అందరి బంగారు భవిత కోసం పాటు పడుతున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరు కదలి రావాలి. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుని అత్యుత్తమ మహానగరంగా తీర్చిదిద్దే సంకల్పంతో పనిచేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం చేసిన మేలును ఎవరూ మరచిపోలేరని అన్నారు.

వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచడంతో పాటు, వారి హక్కులను కాపాడటానికి, సరైన సమయానికి వేతనాలు అందేలా ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌ గారిదే. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడానికి, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యశ్రీ, ఫించను, ఇళ్ల పట్టాలు, అమ్మఒడి తదితర నవరత్నాల పథకాలను వర్తింప చేస్తామని మేనిఫెస్టో సాక్షిగా ఇచ్చిన హామీ అమలు కావాలంటే వైయస్ ఆర్ కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుంటే ఇక్కడి పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా వస్తాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం రికమెండేషన్ చేయాల్సిన పరిస్థితులే, రాష్ట్రంలో జగనన్న తీసుకువచ్చిన సంస్కరణలు ఇస్తున్న మంచి ఫలితాలకు నిదర్శనమన్నారు. అవ్వాతాతలకు ఇంటివద్దనే ఫించను ఇవ్వడంతోపాటు, సంక్షేమ పథకాలను గడప గడపకు చేరుస్తున్న వాలంటీర్లపై విషం కక్కి, బురదచల్లి ఇప్పుడు వారిని ఉద్దరిస్తామంటూ చెపుతున్న వారిని ఎలా నమ్మాలని సూటిగా ప్రశ్నించారు. స్థానికంగా అందరికి అందుబాటులో ఉండే, విశాఖ ఆడ పడుచునైన తనకు ఓటు వేయాల్సిందిగా ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అన్న వివరాలను మహిళల నుంచి అడిగి తెలుసుకుంటూ, మీ కుటుంబానికి మేలు జరిగిందనుకుంటే జగనన్నకు అండగా నిలబడి, ఎన్నికల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఉన్న బట్టల దుకాణం, కళ్లజోళ్ల షాపు, ఇళ్లు ఇలా ప్రతి చోటా మహిళలు తమకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని మొహంలో చిరునవ్వుతో సమాధానమిస్తూ, జగనన్నకు తమ మద్ధతు ఉంటుందంటూ భరోసా ఇచ్చారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News