YS Jagan Mohan Reddy : బాబు – పవన్ ఉతుత్తి హామీలే వైకాపా ని గెలిపిస్తాయి
Qubetvnews - May 2, 2024 / 11:11 AM IST
YS Jagan Mohan Reddy :
కూటమి మేనిఫెస్టో అంటూ కేవలం తెలుగు దేశం పార్టీ – జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ లు విడుదల చేశాడు. మేనిఫెస్టో లోని అంశాలన్నీ కూడా కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే అని క్లీయర్ గా తేలిపోయింది. సామాన్యులకు కూడా ఆ విషయాలు క్లీయర్ గా అర్థం అవుతున్నాయి. ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాల్లో గ్యారెంటీల పేరుతో ఇచ్చిన ఇబ్బడి ముబ్బడి హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాలు చేతులు ఎత్తేశాయి.
బాబోయ్ అన్ని హామీలు మా వల్ల కాదు, మా యొక్క బడ్జెట్ సహకరించడం లేదు అంటూ స్వయంగా ఆ పార్టీ నాయకులు కొందరు బాహాటంగా అనేస్తున్నారు. ఇప్పుడు అవే హామీలను టీడీపీ, జనసేన పార్టీల కూటమి మేనిఫెస్టోలో పొందరు పరిచి ఏపీ ప్రజల ముందు ఉంచడం జరిగింది. కూటమి హామీల్లో సగం కూడా అమలు చేసే సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.
బాబు, పవన్ ల మేనిఫెస్టో మొత్తం తప్పుల తడక అన్నట్లుగా ఉందని, ఆచరణ సాధ్యం కాని ఎన్నో హామీలను అందులో పొందుపరచడం వల్లే మోడీ కి బీజేపీకి ఆ మేనిఫెస్టతో సంబంధం లేదు అన్నట్లుగా ఆ పార్టీ నాయకులు బాహాటంగానే చెప్పేస్తున్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున నిధులను ఏపీకి తీసుకు వస్తాను అంటూ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు అవతలి వైపు నుంచి అంటే మోడీ వైపు నుంచి మాత్రం ఎలాంటి సిగ్నల్ రావడం లేదు. గతంలో మాదిరిగానే మోడీ ప్రభుత్వం రాష్ట్రంకు మొండి చేయి చూపించడం ఖాయం. మోడీ మరియు చంద్రబాబు నాయుడు కలిసి పని చేసే పరిస్థితి లేదు. ఇద్దరి మధ్య కచ్చితంగా రాజకీయ వైరం అనేది రగులుతూనే ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట.
కూటమి మేనిఫెస్టో విడుదల తర్వాత వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గెలుపు మరింత సులభం అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా మేనిఫెస్టో లో సింపుల్ గా చేసేవి చెప్పారు, చేయగలిగినవి మాత్రమే చెప్పారు. కానీ కూటమి మేనిఫెస్టో మాత్రం అభూత కల్పన అన్నట్లుగా ఉంది. సామాన్యులకు కూడా ఆ విషయం అర్థం అవ్వడంతో వైకాపా కంటే సంక్షేమంలో మరే పార్టీ, కూటమి బెస్ట్ కాదు అంటూ నిర్ణయానికి వచ్చారు. ఇష్టానుసారంగా హామీలు ఇస్తే వాటిని అమలు చేయడం సాధ్యం కాక పోవడంతో పాటు కూటమి విచ్చిన్నం అయితే మళ్లీ రాష్ట్రంకు ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకే వైకాపాకు ఓటు వేసి మళ్లీ జగన్ ను సీఎం చేయడం ద్వారా రాష్ట్రం అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్తుందని, అయిదు ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేది ఏపీ ప్రజల మాటగా తెలుస్తుంది.





