Botsa Jhansi Lakshmi : విద్యాభివృద్ధికి కట్టమంచి చేసిన కృషి చిరస్మరణీయం- వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మీ
Qubetvnews - April 26, 2024 / 09:58 PM IST
Botsa Jhansi Lakshmi :
కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్రా విశ్వవిద్యాలయ అభివృద్ధికి చేసిన కృషి అనన్య సామాన్యమన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మీ. శుక్రవారం హార్బర్ పార్క్ ఎంపీ కార్యాలయంలో ఆంద్రా యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆచార్య కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఝాన్సీ లక్ష్మీ.
ఆధునిక, సాంప్రదాయ విద్యా విధానానికి సీఎస్ ఆర్ వారధి వంటివారనీ. ఆయన వేసిన విద్యా విత్తనం నేడు వటవృక్షంలా మారి కోట్ల మందికి విద్యా గంధం పంచుతోందని అన్నారు బొత్స ఝాన్సీ లక్ష్మీ.





