Chandrababu cheats tdp leaders : నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తున్న చంద్రబబాబు.. ఇదేం ప్లాను..?

Qubetvnews - March 1, 2024 / 12:45 PM IST

Chandrababu cheats tdp leaders : నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తున్న చంద్రబబాబు.. ఇదేం ప్లాను..?

Chandrababu cheats tdp leaders : చంద్రబాబు నాయుడి రాజకీయాలను దగ్గరి నుంచి చూసిన వారికి ఓ అభిప్రాయం ఉంటుంది. అదేంటంటే ఒక కుక్కను చంపాలంటే ముందు అది పిచ్చి కుక్క అని దానిపై ముద్రవేయాలి. అప్పుడే దాన్ని చంపేందుకు వీలుంటుంది. లేదంటే మాత్రం దాన్ని ఏమీ చేయలేమన్నది చంద్రబాబు చతురత అని తెలిసిందే. అందుకే ఆయన ఎవరినైనా ముందు పక్కన పెట్టేయాలి అనుకుంటే వారిపై ఏదో ఒకటి ప్రచారం చేసేయాలి. అప్పుడు వారిని పక్కన పెట్టి అదే ప్రచారాన్ని కారణంగా చెప్పుకోవచ్చు. అనాదిగా చంద్రబాబు ఇలాంటి రాజకీయాలను చేస్తున్నారని వైసీపీ పదే పదే ఆరోపిస్తోంది.

ఇప్పుడు చంద్రబాబు మరోసారి అలాంటి రాజకీయాలనే తెరమీదకు తెస్తున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌ తో పొత్తులు పెట్టుకున్నారు చంద్రబాబు. మొన్న 118 సీట్లలో 94 సీట్లను చంద్రబాబు ప్రకటించుకున్నారు. అయితే ఇందులో కొంతమందికి సీట్లు కేటాయించుకున్నారు. ఇంకొన్ని చోట్ల ఎవరికి ఇవ్వాలనేది ఇంకా ఫైనల్ కాలేదు. అయితే ఇలా సీట్లు కేటాయించని చోట ఇప్పుడు ఐవీఆర్ ఎస్ పద్ధతిలో సర్వేలు చేయిస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబు వాయిస్ టోన్ తో సదరు నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తున్నారు. ఆయన వాయిస్ తో ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి.

ఆ నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరినైతే చంద్రబాబు పక్కన పెట్టేయాలని అనుకుంటున్నారో వారి మీద సర్వే చేయిస్తారు. ప్రజలకు ఫోన్ కాల్స్ వెళ్తుంటాయి టీడీపీ ఆఫీస్ నుంచి. సదరు వ్యక్తికి మీ ఓటు వేస్తారా అని ప్రశ్నిస్తుంటారు. ఒకవేళ సానుకూలంగా రిపోర్ట్ వస్తే అప్పుడు ఆయనకు ఓకే అనుకుంటారు. లేదంటే పక్కన పెట్టేస్తుంటారు. అయితే ఇక్కడే ఓ కిటుకు ఉంది. ఎందుకంటే అసలు ఫోన్ కాల్స్ ఎందరికి వెళ్తాయో, ఎవరికి వెళ్లాలో కూడా ముందే డిసైడ్ చేసుకుంటారు. సదరు అభ్యర్థిని వ్యతిరేకంగా ఉన్న వర్గాలకు ఫోన్ చేసి రిపోర్టు రెడీ చేసుకుంటారు.

దాన్ని చూపించి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థిని పక్కన పెట్టేస్తుంటారు చంద్రబాబు. ఏమైనా అంటేనీకు అనుకూలంగా సర్వే రిపోర్టు లేదు కాబట్టి పక్కన పెట్టేస్తున్నా అని చెబుతుంటారు. చంద్రబాబు తనకు నచ్చిన వారికి టికెట్ ఇవ్వాలనుకున్న నియోజకవర్గాల్లో ఎలాంటి సర్వేలు చేయించకుండా టికెట్లు ఇస్తున్నారు.

కానీ ఎక్కడైతే చంద్రబాబుకు నచ్చని వ్యక్తులు టికెట్లు ఆశిస్తుంటారో వారిపై ఇలాంటి ప్లాన్ వేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు తన పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న వారికి ఇలా అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ పార్టీ. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు జిమ్మిక్కులు అర్థం చేసుకోవాలని కోరుతోంది వైసీపీ పార్టీ.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News