Chandrababu : పవన్ ఆశలపై చంద్రబాబు నీళ్లు.. ఇలా ప్లాన్ వేశాడా..?
Qubetvnews - March 7, 2024 / 12:34 PM IST
Chandrababu : పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదేండ్లు అవుతోంది. కానీ ఇంకా ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. గత ఎన్నికల్లో కమ్యూనిష్టు పార్టీలతో పొత్తులు పెట్టుకుని మరీ పోటీ చేసినా సరే రెండు చోట్లా ఆయన ఓడిపోయారు. ఆయన పార్టీ ఏమైనా ఎక్కువ సీట్లు గెలిచిందా అంటే కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలచుకుంది. కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా పార్టీలో లేకుండా పోయారు. దాంతో ఇప్పుడు పవన్ కల్యాణ్ ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా గెలవకపోయినా.. జనసేన నుంచి తానైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు.
ఇందుకోసం చంద్రబాబుతో పొత్తులు పెట్టుకున్నారు. అటు బీజేపీని కూడా కూటమిలోకి లాగేసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత చేస్తున్నా సరే పవన్ కల్యాణ్ లో ఎందుకో గెలపుపై నమ్మకం కనిపించట్లేదు. ఈ సారి గనక గెలవకపోతే పవన్ కల్యాణ్ కు ఇక రాజకీయ భవిష్యత్ అనేది అస్సలు ఉండదు. ఆ భయమే ఆయన్ను ఈ ఎన్నికల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకునేలా చేస్తోంది. పవన్ కల్యాన్ ఈ ఎన్నికల్లో కూడా రెండు చోట్ల నుంచి పోటీ చేయాలని ముందు నుంచే అనుకుంటున్నారంట. భీమవరం నుంచి మరోసారి పోటీ చేయడానికి చంద్రబాబు, లోకేష్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు.
కాగా భీమవరంతో పాటు మరో చోట కూడా పోటీ చేయాలని పవన్ కల్యాణ్ మొదటి నుంచే అనుకుంటున్నారు. ఎందుకంటే కనీసం ఒక చోట ఓడిపోతే ఇంకో చోట అయినా గెలుస్తామని ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇది ఆయనకు రాజకీయాల్లో జీవన్మరణ సమస్య లాగా మారిపోయింది. అందుకే ఈ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఎలాగైనా ఒక చోట నుంచైనా గెలవాలని పట్టుదలగా ఉన్నారు పవన్ కల్యాణ్. అయితే ఇదే విషయాన్ని చంద్రబాబు ముందు చెప్పారంట పవన్ కల్యాణ్. దాంతో పవన్ కల్యాణ్ భయపడుతున్నాడని గ్రహించిన చంద్రబాబు తన చాణక్యాన్ని బయటకు తీశారంట.
రెండు చోట్ల పోటీ చేస్తే భయపడుతున్నాడని ప్రజలు అనుకుంటారని.. అప్పుడు నీ మీద నమ్మకం పోతుందని చెప్పుకొచ్చారంట. గతంలో అంటే రెండు చోట్ల పోటీ చేసినా పర్లేకుండా పోయింది గానీ.. ఈ సారి మాత్రం జగన్ మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది కాబట్టి ఒక చోట నుంచే పోటీ చేయాలంటూ కండీషన్ పెట్టారంట.
దాంతో చంద్రబాబు మాటలను నమ్మిన పవన్ ఇప్పుడు భీమవరం నుంచి పోటీ చేసేందుకు మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. దీంతో జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఒక చోట పోటీ చేసి ఓడిపోతే అది రాజకీయంగా చంద్రబాబుకు పోటీ లేకుండా చేస్తుందని.. అందుకే చంద్రబాబు ఇలా చె ప్పాడేమో అంటున్నారు జనసైనికులు.





