Chandrababu : వాళ్లు మనుషులు కాదా చంద్రబాబు.. ఎందుకంత చులకన..?

Qubetvnews - March 7, 2024 / 08:08 PM IST

Chandrababu :  వాళ్లు మనుషులు కాదా చంద్రబాబు.. ఎందుకంత చులకన..?

Chandrababu : మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే మన కంటే తక్కువ పొజీషన్ లో ఉన్న వారిని అవమానించడం అనేది కరెక్ట్ కాదు. ఆ విషయంలో చంద్రబాబు మాత్రం ఎప్పుడూ విమర్శలు ఎదుర్కుంటూనే ఉన్నారు. చంద్రబాబు అహంకారంతోనే ఇలా చాలా మందిని అవమానించారని అంటున్నారు వైసీపీ నేతలు. ఈ సమాజంలో దళితులు చాలా అవమానాలకు గురయ్యారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అలా అని దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటే కాదు. కానీ సమాజంలో ఉన్న మనం అందరి పట్ల సమాన భావన కలిగి ఉండాలి. అంతే గానీ ఇలా ఎవరినీ అవమానించొద్దు.

అయితే తాజాగా చంద్రబాబు తన రాజకీయ చాణక్యం ప్రదర్శించే క్రమంలో కాస్త కుటిల నీతిని కూడా బయట పెట్టేశారు. చంద్రబాబు మాట్లాడుతూ నేను ఐటీ జాబులు ఇస్తే.. జగన్ మాత్రం మద్యం దుకాణాల్లో, ఫిష్ మార్కెట్ లో, మటన్ మార్కెట్, మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇలా ఐటీ జాబుల గురించి గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఒక్క ఇంజినీరింగ్ స్టూడెంట్ల గురించి మాత్రమే చెబుతున్నారు గానీ.. మిగతా కోర్సుల వారిని మాత్రం నిర్లక్ష్యం చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

సాధారణంగా పెద్ద చదువులు చదువుకున్న వారందరూ ఒకే పొజీషన్ లో ఉంటారనే నమ్మకం లేదు. పైగా అందరికీ ఒకేసారి పెద్ద జాబులు వస్తాయని కూడా లేదు. ఆ పొజీషన్ వచ్చే వరకు ఏదో ఒక జాబ్ చేస్తే దాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు వైసీపీ నేతలు. ఎందుకంటే మొక్క నాటగానే కాయలు కాయదు కదా.. అందుకే ఎవరి వంతు వచ్చే వరకు వారు వెయిట్ చేయాల్సిందే. ఆ విధంగా వారిని ప్రోత్సహించాలి. ఇప్పుడు జగన్ కూడా అందరినీ ప్రోత్సహిస్తున్నారు. వారు ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా స్కీములు కూడా అమలు చేస్తున్నారు.

ఇక చంద్రబాబు ఇటు వాలంటీర్లను కూడా వదల్లేదు. ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్లకు తాను అధికారంలోకి రాగానే పెద్ద జాబులు వచ్చేలా చేస్తానని చెబుతున్నారు. వాలంటీర్లలో చాలా మంది చిన్న చదువులు చదువుకున్న వారు అలాగే పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా ఉన్నారు.

వారికి జాబులు ఇచ్చి ఆదుకున్నామని జగన్ ఏనాడూ చెప్పలేదు. వారు ఇతర జాబులు వచ్చే వరకు ఇలా ప్రోత్సహిస్తున్నామని మాత్రమే చెప్పారు. చంద్రబాబు మాత్రం వారిని తక్కువ చేసినట్టు మాట్లాడటం ఏంటని మండిపడుతున్నారు వైసీపీ నేతలు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News