Chandrababu : జగన్ పథకాలతో ఏపీ మరో శ్రీలంక అని మాట్లాడి.. ఇప్పుడు సూపర్ సిక్స్ అని హామీలేంటి బాబూ?

Qubetvnews - April 28, 2024 / 05:52 PM IST

Chandrababu : జగన్ పథకాలతో ఏపీ మరో శ్రీలంక అని మాట్లాడి.. ఇప్పుడు సూపర్ సిక్స్ అని హామీలేంటి బాబూ?

Chandrababu :

నేను విన్నాను, నేను ఉన్నాను అన్న మాటని నిజం చేస్తూ పాదయాత్రలో ప్రజల గోడు విన్న జగన్, వాళ్ల సమస్యలు తీరేలా, బతుకులు బాగుపడేలా పథకాలను రూపొందించి 2019 ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించాడు. గెలిచాక సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ ఎన్నికల్లో కూడా సంక్షేమానికే పెద్దపీట వేస్తూ పథకాలను ప్రకటించడంతో వైసీపీ గెలుపు అవకాశాలు మరింత పెరిగాయి.

తమ పాలనలో చేతకాని ప్రజా సంక్షేమం వైసీపీ హయాంలో జరుగుతుండడంతో ఓర్వలేని ప్రతిపక్షాల కళ్లు మండాయి. ఇలా పథకాలిచ్చుకుంటూ పోతే ఏపీ మరో శ్రీలంక అవుతుందంటూ జగన్ సర్కార్ అందించిన సంక్షేమాన్ని చూసి జనసేన, టీడీపీ విమర్శలు చేశాయి. కానీ ఇప్పుడు కూటమి మ్యానిఫెస్టోలో సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ అదే జనసేన, టీడీపీ హామీలిస్తున్నాయిప్పుడు. మరి జగన్ పథకాలిస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నారు, ఇప్పుడు మీరు పథకాలిస్తే ఏపీ అమెరికా, సింగపూర్ అవుతుందా? అంటూ కామెంట్ చేస్తున్నారు కూటమి తీరు చూసిన జనం.

వాస్తవానికి సూపర్ సిక్స్ పేరుతో కూటమి ప్రకటించిన ఆరు హామీలు అమలుకు సాధ్యం కావు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. జగన్ ని మించిన పథకాలు మేమూ ఇస్తాం అని నమ్మించి ఎన్నికల్లో గెలవడానికి చేస్తున్న కుట్రల్ని ప్రజలు నమ్మే పరిస్థితిల్లో లేరు. ఎందుకంటే 2019లో వైసీపీ మ్యానిఫెస్టో చూసి ఇన్ని ఇవ్వడం అసాధ్యం అన్నారు. కానీ జగన్ చేసి చూయించాడు. కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం, రాజకీయాలు చేయం అంటూ ప్రచారంలో చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించాడు. మాటిస్తే మడమ తప్పేదే లేదని నిరూపించాడు. దాంతో 2024 ఎన్నికల మ్యానిఫెస్టోని కూడా జగన్ నిజం చేసి ఏపీని ఎందులోనూ తక్కువ కాకుండా చూసుకుంటాడన్న నమ్మకం. ఈ ఐదేళ్ల పాలన చూశాక జనాల మనసులో మాట సింపుల్ గా ఒకటే. జగన్ అంటే నమ్మకం. జగన్ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే నిఖార్సైన నాయకత్వం.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News