YS Sharmila And YS Sunitha Reddy : గందరగోళంలో షర్మిల, సునీత.. దిక్కుతోచని స్థితిలో అక్కాచెళ్లెల్లు…………….

Qubetvnews - April 24, 2024 / 06:18 PM IST

YS Sharmila And YS Sunitha Reddy  : గందరగోళంలో షర్మిల, సునీత.. దిక్కుతోచని స్థితిలో అక్కాచెళ్లెల్లు…………….

YS Sharmila And YS Sunitha Reddy  :

గెలిస్తే ఏం చేస్తామనో, పార్టీ తరపున ప్రజలకు ఎలాంటి సంక్షేమం అందుతుందనో, తమకే ఎందుకు పట్టం కట్టాలనో ప్రజల్లో చెప్పుకుని ఓట్లు అడగలేక ఎంతసేపూ వివేకా హత్య కేసునే పదేపదే ప్రస్తావిస్తూ సునీత, షర్మిల ఎలక్షన్ ప్రచారం నిర్వహించడంతో ప్రజలకే విసుగొచ్చింది. అధికారంలో ఉన్న పార్టీ పాలనా తీరుని విమర్శిస్తే ప్రజలు కూడా ఆలోచిస్తారు. హామీల అమల్లో జాప్యం ఉంటే గతాన్ని గుర్తు చేసుకుంటారు. కానీ వైసీపీ విషయంలో అలాంటి నెగిటివ్ కామెంట్స్ చేసేందుకు పెద్ద స్కోప్ లేదనుకున్నారో, లేక అలాంటివి చెప్పే కంటే వైఎస్ వివేకా హత్య గురించి చెప్తేనే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందనుకున్నారో కానీ ఎలక్షన్ల సందడి మొదలైన నాటినుంచీ ఆ ఒక్క అంశాన్నే ప్రస్తావిస్తూ వస్తున్నారు.

కడప ఎంపీ బరిలో ఉన్న షర్మిలకి మద్ధతుగా సోదరి సునీత కూడా చేతులు కలిపి ప్రచారంలో పాలు పంచుకుంటోంది. అంతవరకూ బానే ఉంది. కానీ చెప్పడానికి ఇంకేమీ లేదన్నట్టుగా వివేకా హత్య గురించే మాట్లడుతుండడంతో ఆ కేసుపై ఇక మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఆదేశాలిచ్చింది. దాంతో అక్కాచెల్లెల్లిద్దరికీ ఆయుధం లేకుండా పోయిందని అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఆ ఒక్క అంశంతోనే ప్రజల్లోకెళ్తూ ఓట్లు దండుకోవాలన్న ఆలోచనతో రంగంలోకి దిగారు. హామీలు, సంక్షేమం, పథకాలు, అభివృద్ధి లాంటి వాటిని పెద్దగా నమ్ముకోకపోవడంతో ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అన్న గందరగోళంలో ఉన్నారని ఫ్యాన్ పార్టీ అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

షర్మిల, సునీతే కాదు.. బీజేపీ, టీడీపీ, జనసేన కూడా వివేక హత్య కేసుతో రాజకీయ ప్రయోజనాలు పొందాలన్న ఆలోచనలో ఉన్నాయని వైసీపీ వర్గాలు ఓపెన్ గానే విమర్శిస్తున్నాయి. ఊహించని విధంగా ఆదేశాలు రావడంతో దిక్కుతోచని స్థితిలో కడప కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత ఏపీ హైకోర్టును ఆశ్రయించిందన్న ఘాటు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ముడిపెట్టి జగన్ ని ఇబ్బంది పెట్టాలన్న వారి ప్లాన్ బెడిసికొట్టడంతో ప్లాన్ బీ లేక చతికిలపడ్డ షర్మిళ, సునీతలు కోర్టు ఆదేశాలని జీర్ణించుకోలేక న్యాయవ్యవస్థలని కూడా విమర్శించే స్థాయికి దిగజారారంటూ సోషల్మీడియాలోనూ పోస్టులు దర్శనమిస్తున్నాయి.

వివేకా హత్యకేసుని పస్తావించకపోతే, దాని గురించి మాట్లాడకపోతే ప్రజలు పట్టించుకునే పరిస్థితే ఉండదు కదా. క్యాడర్ లేని పార్టీతో, కంటెంట్ లేని ప్రచారంతో, జనాలే అసలే లేని విశ్వాసంతో ఎలా ముందుకెళ్లడం? ఎలా ఓట్లు సంపాదించుకోవడం అంటూ అక్కాచెల్లెలిద్దరూ డీలాపడ్డారని వైసీపీ నేతలు తీవ్రంగా ఫైరవుతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News