Chandrababu quest for BJP : బీజేపీ కోసం చంద్రబాబు ఆరాటం.. ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేస్తారా..?

Qubetvnews - February 25, 2024 / 07:43 AM IST

Chandrababu quest for BJP : బీజేపీ కోసం చంద్రబాబు ఆరాటం.. ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేస్తారా..?

Chandrababu quest for BJP : చంద్రబాబు గత కొన్ని రోజుల నుంచి ఒక మాట బలంగా చెబుతున్నారు. ఈ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సొంతంగా గెలుస్తుందని.. కనీసం 130 సీట్లు అయినా టీడీపీకి వస్తాయని చెబుతున్నారు. మరి చంద్రబాబు చెప్పినట్టు నిజంగానే టీడీపీకి అంత సీన్ ఉందా అంటే అనుమానమే అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు సింగిల్ గా గెలిచేంత ఉంటే జనసేనతో పొత్తులు పెట్టుకోరు కదా అనేది ఒక వర్షన్ మాట. ఇప్పటికే జనసేనతో పొత్తులో భాగంగా టీడీపీ చాలా సీట్లను త్యాగం చేయాల్సి వస్తోందని ఆ పార్టీ నేతలు రగిలిపోతున్నారు. జనసేన కోసం అన్ని సీట్లు ఇచ్చేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా లేరు.

కానీ చంద్రబాబు మాత్రం తనకు రాజకీయంగా ముఖ్యమంత్రి పదవి కావాలనే ఉద్దేశంతో జనసేనతో ఇష్టం లేకపోయినా పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు జనసేన కోసమే త్యాగాలు చేయాలి అంటే.. అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు బీజేపీతో కూడా చంద్రబాబు పొత్తులు పెట్టుకునేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే టీడీపీ, జనసేన మహాకూటమిగా మారిపోయిందని.. జగన్ ను ఓడించడం ఖాయం అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్న టీడీపీ, జనసేన పార్టీలు.. మరి ఇంక బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటున్నారో అస్సలు చెప్పట్లేదు.

టీడీపీ, జనసేన కూటమి దెబ్బకు జగన్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పన చంద్రబాబు, పవన్ లు.. ఇప్పుడు బీజేపీ కోసం ఎందుకు ఢిల్లీకి తిరుగుతున్నారనేది అర్థం కావట్లేదు. ఇకా చాలా రోజులుగా సీట్ల పంపకాలపై ఊరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. ఈ రోజు కొన్ని సీట్లను ప్రకటించుకున్నారు. ఇందులోనూ టీడీపీకే ఎక్కువ సీట్లు కేటాయించుకున్నారు చంద్రబాబు. జనసేనకు ఏవో నాలుగు సీట్లు ముష్టి పడేసినట్టు వేసేశాడని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు మెజార్టీ సీట్లను ప్రకటించుకుండా బీజేపీ కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు చంద్రబాబు.

బీజేపీ కోసం కనీసం 57 సీట్లు రిజర్వ్ చేసి ఉంచాడని తెలుస్తోంది. ఇప్పుడు రాజకీయంగా చంద్రబాబుకు బీజేపీ అవసరం ఏర్పడింది. అందుకే ఇప్పుడు బీజేపీ ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు బీజేపీకి సీట్లు కేటాయించేందుకు రెడీ అయిపోయారు.

మరి ఇన్ని రోజులు సొంతంగా గెలుస్తామని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు పొత్తులు ఎందుకు కావాలంటున్నాడు. అంటే ఆయనకు సొంతంగా గెలిచేంత దమ్ము లేదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఎన్నికలకు సొంతంగా వెళ్లడానికి కూడా చంద్రబాబు సిద్ధంగా లేరని అంటున్నారు వైసీపీ నేతలు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News