Chandrababu surety to Pawan : పవన్ కు మాత్రమే ష్యూరిటీ ఇచ్చిన చంద్రబాబు.. ప్రజలకు కాదండోయ్..!
Qubetvnews - February 25, 2024 / 12:10 PM IST
Chandrababu surety to Pawan : ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఏపీలో రోజుకో కార్యక్రమం తెరమీదకు వస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు ఏదో ఒకటి చేసి జగన్ ను ఓడించాలని చాలానే పన్నాగాలు పన్నుతున్నాయనేది వైసీపీ వాదన. అందుకు తగ్గట్టే చంద్రబాబు అండ్ పవన్ కల్యాణ్ కలిసి ముందుకు వెళ్తున్నారు. ఇక తాజాగా చంద్రబాబు మరో కార్యక్రమాన్ని ముందుకు వేసుకున్నారు. అదేంటంటే బాబు ష్యూరిటీ-భవితకు గ్యారెంటీ. ఈ కార్యక్రమం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ కార్యక్రమం గురించి విన్న వారంతా షాక్ అయిపోతున్నారు.
మరీ ముఖ్యంగా వైసీపీ వాళ్లు మాత్రం దారుణంగా దాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. బాబు ష్యూరిటీ కేవలం పవన్ కల్యాణ్ కు మాత్రమే ఉంది తప్ప.. జనాలకు కాదంటున్నారు. నిన్న పవన్ కల్యాణ్, చంద్రబాబు కలిసి ఉమ్మడిగా మొదటి లిస్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో దారుణంగా జనసైనికులకు అన్యాయం జరిగింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి తమ గొంతు కోశారని జనసైనికులు వాపోతున్నారు. పవన్ ను నమ్ముకున్నందుకు ఇంత ద్రోహం జరిగిందనే టాక్ వారి నుంచి వినిపిస్తోంది. 118 సీట్లను ప్రకటిస్తే అందులో మరీ దారుణంగా ఏదో ముష్టి వేసినట్టు కేవలం 24 సీట్లను కేటాయించడంపై జనసేన భగ్గుమంటోంది.
ఈ సీట్ల కేటాయింపులు చూస్తుంటే పవన్ కల్యాణ్ కు మాత్రమే చంద్రబాబు ష్యూరిటీ ఇచ్చారు గానీ.. జనసైనికులకు గానీ.. ఇటు జనాలకు గానీ ఇవ్వలేదని తాజాగా వినిపిస్తున్న వాదన. చంద్రబాబుతో పొత్తులు పెట్టుకున్న జనసేననే నిండా ముంచేశాడు.. ఇంక జనాలకు ష్యూరిటీ ఎలా ఇస్తాడు.. వారి భవితకు గ్యారెంటీ ఎక్కడిది అని అంటున్నారు వైసీపీ నేతలు. పవన్ కల్యాణ్ తన స్వార్థ రాజకీయాల కోసం ఆయన పొత్తులు పెట్టుకుని అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నారు. అంతే తప్ప తనను నమ్ముకున్న జనసైనికులకు మాత్రం నిండా ముంచేశాడని ఆరోపిస్తున్నారు.
ఇలాంటి సందర్భంలో చంద్రబాబు ష్యూరిటీ ఎవరికి ఇస్తున్నారు.. భవితకు గ్యారెంటీ ఎలా ఇస్తారు అని ప్రశ్నలు గుప్పిస్తున్నారు మేథావులు. గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు అప్పుడు ఎలాంటి పనులు చేయకపోగా.. ఇప్పుడు మాత్రం ఏదో చేస్తానన్నట్టు మాయమాటలు చెబుతున్నాడని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు.
ఇన్ని రోజులు చంద్రబాబును నమ్ముకుని మోసపోయింది చాలు.. ఇక మోసపోయేది లేదని అంటున్నారు జనసైనికులు. ఇలా చంద్రబాబు మిత్ర పక్షం నుంచే తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తుంటే.. చంద్రబాబు మాత్రం ప్రజలకు ఏదో చేస్తానని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు వైసీపీ వాల్లు.





