CM Jagan : వైసీపీ మ్యానిఫెస్టో విడుదల.. మళ్లీ సంక్షేమానికే పెద్ద పీట వేసిన జగన్
Qubetvnews - April 27, 2024 / 02:48 PM IST
CM Jagan :
తాము మళ్లీ అధికారంలోకొస్తే నెరవేర్చే హామీలు, అందించే సంక్షేమ పథకాల వివరాలతో వైసీపీ మ్యానిఫెస్టోని విడుదల చేశారు సీఎం జగన్. మేనిఫెస్టో అంటే ఓ బైబిల్, ఓ ఖురాన్, ఓ భగవద్గీత అనీ.. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు, ఓట్ల కోసం అసాధ్యమైన హామీలను ఇవ్వడం తనకు చేతకాదని, ఈ విషయంలో చంద్రబాబుతో పోటీపడలేనని అన్నారు సీఎం జగన్ సాధ్యమయ్యే, చేయగలిగే హామీలనే ఇచ్చానని వివరించారు.

CM Jagan released YSRCP manifesto with details of welfare schemes
ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటిస్తాయి. కానీ మేనిఫెస్టోలకు నిజమైన విలువ, గౌరవం కేవలం తన హయాంలో మాత్రమే దక్కాయన్నారు జగన్. చంద్రబాబులా అమలు కాని హామీలను ఇవ్వనందునే 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాలేదనీ, అయితే అందుకు తాను బాధపడలేదనీ, అలాంటి సాధ్యం కాని మ్యానిఫెస్టోతో చరిత్రహీనుడిగా మిగిలిపోకూడదనే తన ఉద్దేమన్నారు.

CM Jagan released YSRCP manifesto with details of welfare schemes
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చి ఇప్పుడు గర్వంగా మళ్లీ ప్రజల ముందుకు వెళుతున్నానని పేర్కొన్నారు జగన్. గత ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టో కాపీలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో, కీలక అధికారుల వద్ద ఉన్నాయనీ, ఏటేటా మేనిఫెస్టోపై ప్రోగ్రెస్ కార్డును రాష్ట్రంలోని ఇంటింటికీ పంపించామని తెలిపారు జగన్. ప్రస్తుత ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ అలవికాని హామీలను చెబుతూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు జగన్.

CM Jagan released YSRCP manifesto with details of welfare schemes
ప్రధానంగా రెండు విడతల్లో పెన్షన్ రూ. 3500 కు పెంపు, వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందిస్తున్న మొత్తాన్ని 8 విడతల్లో రూ. 75 వేల నుంచి రూ. 1.50 లక్షలకు పెంపు, అమ్మ ఒడి పథకం కింద అందిస్తున్న మొత్తాన్ని రూ. 2 వేలు పెంచి రూ. 17 వేలు అందజేస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు జగన్. వీటితో పాటు వైస్సార్ రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకు రూ.16 వేలు, వైఎస్సార్ కాపు నేస్తం లబ్దిదారులకు ఇప్పుడిస్తున్న రూ.60 వేలను నాలుగు విడతల్లో రూ.1.20 లక్షలకు పెంచుతామని హామీల్లో పొందుపరిచారు.

CM Jagan released YSRCP manifesto with details of welfare schemes
ఈబీసీ నేస్తం కింద ఇప్పుడిస్తున్న రూ. 45 వేల మొత్తాన్ని రూ.1.05 వేలకు పెంచుతామనీ. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణంతో పాటు అర్హులైన పేదవాళ్లకు ఇళ్లు, వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా, విద్యాకానుక పథకాల కొనసాగింపు, లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపుతో పాటు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా.. ఇలాంటి ప్రధాన హామీలతో మ్యానిఫెస్టో ప్రకటించారు జగన్.

CM Jagan released YSRCP manifesto with details of welfare schemes
గత ఐదేళ్లుగా సంక్షేమంతో, ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలతో పాలన సాగించిన జగన్ ఈ ఎన్నికల మ్యానిపెస్టోలో కూడా సంక్షేమానికే పెద్ద పీట వేయడం, గతంలో ఉన్న పథకాలను కొనసాగిస్తూనే అందించే అమౌంట్ పెంచడంతో మళ్లీ ఈసారి కూడా అధికారంలోకొచ్చే సూచనలున్నాయనేది పొలిటికల్ అనలిస్టుల మాట.

CM Jagan released YSRCP manifesto with details of welfare schemes

