Pawan Kalyan : పవన్ పిఠాపురానికి వస్తేనే ప్రమాదం.. అభిమానుల్లో ఆందోళన..!
Qubetvnews - April 7, 2024 / 12:12 PM IST
Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు ఏపీలో అతిపెద్ద అభిమాన వర్గాలు ఉన్నాయి. అందులోనూ కాపు యువతలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో పెద్ద స్టార్ హీరో కాబట్టి ఆ మాత్రం ఉండటం కామన్. అయితే ఆ కాపు కులాన్ని నమ్ముకుని పవన్ కల్యాణ్ ఈఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో గెలవాలని టార్గెట్ గాపెట్టుకున్నారు పవన్ కల్యాణ్. అందుకే పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే విడతల వారీగా నాలుగు రోజులు పిఠాపురంలో గడిపారు పవన్ కల్యాణ్. అయితే దూరపు కొండలు నునుపు అన్నట్టు పవన్ ను చూసి మురిసిపోయారు ఆయన అభిమానులు.
కానీ ఇప్పుడు సడెన్ గా ఆయన పిఠాపురంకు వెళ్లేసరికి పవన్ బాడీ లాంగ్వేజ్ ను చూసి వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకంటే పవన్ కల్యాణ్ అక్కడికేదో తానే దైవాంశ సంభూతుడిని అన్నట్టు బిల్డప్ ఇస్తున్నట్టు వారు విమర్శలు గుప్పిస్తున్నారు. కనీసం పవన్ కల్యాణ్ ను కలుసుకునే వీలు కూడా ఉండదని.. ఆయన చుట్టూ ఎప్పుడూ టైట్ సెక్యూరిటీ ఉంటుందని.. ఆయనతో ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితులు పిఠాపురంలో ఉంటున్నాయని మండిపడుతున్నారు ఆయన అభిమానులు. ఆ సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని తామే వెళ్లలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.
అలాంటిది ఇక సామాన్య ప్రజలు అసలు పవన్ కల్యాణ్ ను కలిసే పరిస్థితులు ఉండవని.. ఆయనకు ఓటేసినా ఆయన తమను కలిసే అవకాశమే లేదనే చర్చ ఇప్పుడు పిఠాపురంలో జోరందుకుంది. పవన్ కల్యాణ్ ను కలవాలని ఒక సామాన్యుడికి ఉంటే అది సాధ్యం అయ్యే పరిస్థితి కాదని అంటున్నారు కాపు యువత. కాబట్టి పవన్ కల్యాణ్ పిఠాపురంకు వస్తేమాత్రం ప్రత్యర్థులకు ప్రచార అస్త్రాలు దొరికినట్టే అని భావిస్తున్నారు. ఎందుకంటే పవన్ కల్యాణ్ ను కలవడం అనేదే ఓ పెద్ద టాస్క్ లాగా మారిపోయింది. అలాంటి వ్యక్తిని నియోజకవర్గ ప్రజల తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లి కలిసే ఛాన్సేఉండదని అంటున్నారు.
కాబట్టి పిఠాపురంకు పవన్ కల్యాణ్ రాకపోవడమే మంచిదని అంటున్నారు. ఎందుకంటే పవన్ కల్యాణ్ పిఠాపురానికి వచ్చి ఈ హైరానా చేస్తే మాత్రం ఆయన్ను ఓడించడానికి ప్రత్యర్థులు అవసరం లేదని అంటున్నారు కాపు యువకులు. ఇప్పట్లో పవన్ కల్యాణ్ పిఠాపురంకు రాకపోతేనే బెటర్ అని చెబుతున్నారు.
అవసరం అయితే జనసేన తరఫున రాష్ట్రమంతా తిరిగితే అలా అయినా సంతోషిస్తామని అంటున్నారు. మొత్తంగా పవన్ కల్యాన్ కు ఇప్పుడు పిఠాపురం పెద్ద సవాలే విసురుతోంది.



