Pawan Kalyan : ఆ రెండు చోట్లా అభ్యర్థులే దిక్కులేరా.. ఏంటిది పవన్..?

Qubetvnews - March 25, 2024 / 12:25 PM IST

Pawan Kalyan : ఆ రెండు చోట్లా అభ్యర్థులే దిక్కులేరా.. ఏంటిది పవన్..?

Pawan Kalyan : పవన్ కల్యాన్‌ పార్టీ పెట్టి పదేండ్లు అవుతోంది. కానీ ఇంకా ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయన పార్టీలో లేరు. ఇంకా చెప్పాలంటే ఆయనకే దిక్కులేదు. కానీ ఆయన చెప్పే డైలాగులు మాత్రం మామూలుగా ఉండవు. వైసీపీని పాతాళంలోకి తొక్కేస్తా.. జగన్ ను ఓడించి కటకటాల్లోకి పంపిస్తా ఇలాంటి డైలాగులు చాలానే ఉన్నాయి ఆయన వద్ద. జగన్ ను ఓడించడం బాబు వల్లే కావట్లేదు. అలాంటిది ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేని పవన్ ఏం చూసుకుని ఇలాంటి పని చేస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. ఇక ఆయన చంద్రబాబును కూడా వదట్లేదండోయ్.

రీసెంట్ గా చంద్రబాబుతో పొత్తులు పెట్టుకున్న తర్వాత పవన్ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో చూస్తూనే ఉన్నాం. జనసేనతో పొత్తులు పెట్టుకున్న తర్వాతనే టీడీపీకి ఆదరణ పెరుగుతోంది అంటూ చెబుతున్నారు. ఈ మాటలు కూడా టీడీపీకి రగిలిపోయేలా చేస్తున్నాయి. మరి పవన్ కల్యాణ్‌ పార్టీకి నిజంగానే ప్రజల్లో అంత ఆదరణ, క్రేజ్ ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి అంత ఆదరణ ఉన్న పార్టీకి గౌరద ప్రదమైన సీట్లు ఎందుకు కేటాయించలేకపోయారు. కేవలం 24 సీట్లు కేటాయిస్తే.. అందులో మూడు పోయి ఇప్పుడు కేవలం 21 సీట్లే ఉన్నాయేంటి అని అడుగుతున్నారు.

పోనీ ఆ 21 సీట్లకు అయినా అభ్యర్థులు వారికి దొరకట్లేదా అని విమర్శిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఎందుకంటే ఇప్పుడు విశాఖ సౌత్ నియోజక్వర్గంలో జనసేనకే టికెట్ వచ్చింది. కానీ ఇక్కడ పవన్ కు అభ్యర్థి దిక్కులేడు. అందుకే వైసీపీ నుంచి వచ్చిన వంశీకృష్ణకు టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు. కానీ వంశీకృష్ణకు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని లోకల్ జనసేన కేడర్ భగ్గుమంటోంది. ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వొద్దని అంటున్నారు. దాంతో ఈ సీటును సస్పెన్స్ లో పెట్టేశాడు పవన్ కల్యాణ్‌. అంతే గానీ లోకల్ కేడర్ కోరుతున్నట్టు అక్కడ జనసేన నేతకు టికెట్ ఇవ్వట్లేదు.

అటు తిరుపతిలో కూడా అంతే. తిరుపతిలో జనసేనకు కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఆశపడి దాన్ని తీసుకున్నారు పవన్ కల్యాన్‌. పోనీ అక్కడైనా జనసేనలో ఉన్న వారికి టికెట్ ఇచ్చారా అంటే అదీ లేదు. చిత్తూరు నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుకు టికెట్ కేటాయించాడు.

శ్రీనివాసులుకు టికెట్ ఇవ్వడంతో లోకల్ కేడర్ రగిలిపోతోంది. ఇలా రెండు చోట్ల పక్క పార్టీ నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇచ్చుకున్న పవన్.. 21 సీట్లలో కూడా సొంత కేడర్ కు టికెట్లు ఇచ్చుకోలేని స్థితిలో ఉంది ఆయన పార్టీ. అంటే జనసేనకు ఏ రేంజ్ లో పట్టు ఉందో అర్థం అవుతోందని అంటున్నాయి వైసీపీ వర్గాలు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News