Janasena : టీడీపీ అనుకూల సర్వే.. ఆలోచనలోపడ్డ జనసేన

Qubetvnews - February 17, 2024 / 07:45 AM IST

Janasena : టీడీపీ అనుకూల సర్వే.. ఆలోచనలోపడ్డ జనసేన

Janasena  :

ఎలక్షన్లు ముందు ప్రజల మూడ్ ఎలా ఉందో.. ఏ పార్టీ గెలుస్తుందో తెలుసుకోవడానికి చేసే సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. ఇండియా టుడే ఈ సర్వే నిర్వహిస్తుంది. ఇందులో లోక్‌ సభ ఎన్నికల్లో ఈ సారి చంద్రబాబు గెలుస్తారని ప్రజలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీకి 17 స్థానాలు వస్తే, వైసీపీకి కేవలం 8 స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వేలో తేలింది. ప్రజలు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చెబుతోంది. దీంతో టీడీపీకి అనుకూల‌మైన ‘ఇండియా టుడే’ స‌ర్వే ఫ‌లితాల‌ను యెల్లో మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. టీడీపీ 45 శాతం ఓట్లతో 17 ఎంపీ, వైసీపీ 41.1శాతం ఓట్లతో 8 సీట్లను ద‌క్కించుకుంటుందని ఆ స‌ర్వే రిపోర్ట్ చెబుతోంది. ఈ సారి ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ ఏ మాత్రం ప్రజల్లోకి వెళ్లలేకపోయిందని స‌ద‌రు స‌ర్వే ఫ‌లితాల్లో వెల్లడైంది.

ఈ స‌ర్వే ఫ‌లితాల‌పై ప్రతిపక్షాలు వైసీపీని బద్ధ శత్రువుగా ప్రచారం చేస్తున్నాయి. ఇటు యెల్లో మీడియా కూడా వైసీపీని క్షణం తీరిక లేకుండా తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిజంగా ప్రజల్లో వైసీపీపై అంత వ్యతిరేకత ఉంటే మరి 41.1శాతం ఓటు బ్యాంక్ ఎలా వస్తుందనేది పది వేల రూపాయల ప్రశ్న. ఎనిమిది ఎంపీ సీట్లను వైసీపీ ద‌క్కించుకుంటుందంటే… 2019లో టీడీపీ ఘోర ప‌రాజ‌యంతో పోలిస్తే, వైసీపీ ఏమంత భ‌య‌ప‌డాల్సిన ద‌య‌నీయ స్థితిలో లేద‌న్న విషయం స్పష్టమవుతుంది.

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ కేవలం మూడు ఎంపీ స్థానాలను 1మాత్రమే గెలుచుకోగలిగింది. నిజాలు దాచిపెట్టి ఫేవర్ గా సర్వే ఫలితాలు రావడంతో టీడీపీ నేతలకు లోలోపల ఆనందంగా ఉంది. కానీ ఈ స‌ర్వే ఫ‌లితాలు జ‌న‌సేన‌కు మాత్రం కోపం తెప్పిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌ ఇండియా టుడే స‌ర్వే ఫ‌లితాల ప్రకారం ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ 8 శాతం ఓట్లు పోగొట్టుకుంది. టీడీపీ 5శాతం ఓట్లను పెంచుకుంది. జ‌న‌సేన‌కు ఏ మాత్రం అతీగతీ లేకుండా పోయింది. అనూహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా త‌మ ఓట్ల శాతాన్ని పెంచుకున్నాయి.

ఐదేళ్లుగా ఏ మాత్రం ప్రభావం చూప‌ని, ఓట్లను పెంచుకోలేని జనసేనతో టీడీపీ ఎందుకు పొత్తుకు పోతుందో అర్థం కావడం లేదు. పార్టీ పెట్టి ఇన్నాళ్లైనా జ‌న‌సేన కాస్తంత కూడా ఎద‌గ‌లేదని స‌ర్వేలో కూడా వెల్లడైంది. అందుకే ఈ స‌ర్వే ఫ‌లితాల‌పై జ‌న‌సేన గుర్రుగా వుంది. ఇదంతా మైండ్ గేమ్ అని జ‌న‌సేన నేత‌లు ఆరోపిస్తున్నారు.

Janasena Expresses Anger India Today Survey Results In AP

Janasena Expresses Anger India Today Survey Results In AP

‘ఇండియా టుడే’ స‌ర్వేలో టీడీపీకి అనుకూలం అని చెప్పడం వ‌ర‌కు ఓకే, మ‌రి ఆ పార్టీ భాగస్వామి జ‌న‌సేనకు అంత సీన్ లేద‌న‌డాన్ని ఏమంటారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. స‌ర్వేపై వైసీపీ మాత్రమే కాదు, టీడీపీ దాని ప్రియురాలు జ‌న‌సేన కూడా గుర్రుగా ఉందంటే.. ఆ రెండు పార్టీల విశ్వసనీయత ఏంటో ఇట్టే అర్థం అయిపోతుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News