Pawan Kalyan : పవన్ కోసం మెగా అభిమానుల సోషల్ వార్.. ఆ పదవి ఇవ్వాలంటూ పోస్టులు..!
Qubetvnews - June 10, 2024 / 09:34 PM IST
Pawan Kalyan : మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఈ సారి టీడీపీకి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ సీట్లు వచ్చాయి. అయినా సరే కూటమి గెలుపులో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే అసలు పవన్ కల్యాణ్ వల్లే టీడీపీకి అన్ని సీట్లు వచ్చాయని అంటున్నారు. దాంతో ఇప్పుడు జనసేనకు ఏపీ ప్రభుత్వంలో పెద్ద పీట వేస్తారనే ప్రచారం వస్తోంది. అయితే పవన్ కల్యాణ్ కు మాత్రం ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. కచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని అంటున్నారు.
అటు పవన్ కల్యాణ్ కూడా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను డిప్యూటీ సీఎం పదవి స్వీకరించేందుకు సిద్ధంగానే ఉన్నట్టు తెలిపారు. అయితే రేపు జరిగే మీటింగ్ లో ఎవరికి ఏ పదవులు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా పవన్ కల్యాణ్‌కోసం ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. తన తమ్ముడికి పెద్ద పదవి వచ్చేలా పైరవీలు చేస్తున్నారని కూడా అంటున్నారు. అదే సమయంలో మెగాస్టార్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు అందరూ కూడా పవన్ కల్యాణ్ కు సపోర్టుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.
పవర్ ఫర్ పవన్ అనే హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. కచ్చితంగా పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందే అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. దాంతో ఇప్పుడు పవన్ కల్యాణ్ పేరు సోషల్ మీడియాలో ఓ సంచలనం రేపుతోంది. కచ్చితంగా పవన్ కల్యాణ్ కు పెద్ద పదవి అనే డిమాండ్లు ఇప్పుడు టీడీపీ మీద తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకపోతే.. హోం మినిస్టర్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. దాంతో ఇప్పుడు పవన్ కల్యాణ్ పేరు ఏపీ రాజకీయాల్లో అందరి చూపును ఆకర్షిస్తోంది.
అయితే పవన్ కల్యాణ్ కు గనక అనుకన్న పదవి ఇవ్వకపోతే మాత్రం కచ్చితంగా టీడీపీ మీద జనసైనికులు, మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయంగా భవిష్యత్ లో కొన్ని వర్గాలు టీడీపీకి దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు.
కాబట్టి జనసేనతో పెట్టుకుంటే తనకు ప్రమాదమే అని చంద్రబాబు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో జనసేన తనకు కుడి భుజంగా ఉండాలని టీడీపీ కోరుకుంటోంది. అందుకే పవన్ కు కీలక పదవి ఇవ్వడానికి కూడా చంద్రబాబు వెనకడుగు వేయకపోవచ్చని చెబుతున్నారు.




