Pavan Kalyan Cheats Kapu Politicians : కాపుల్లో అంతర్మథనం.. పవన్ ను వీడబోతున్నారా..?
Qubetvnews - February 26, 2024 / 11:35 AM IST
Pavan Kalyan Cheats Kapu Politicians : పవన్ కల్యాణ్ సినిమాల్లో పెద్ద స్టార్. కానీ రాజకీయాల్లోకి వచ్చే సరికి మాత్రం అది రివర్స్ లో ఉంది. ఆయన రాజకీయాల్లో నిలకడ లేని వైఖరిని మొదటి నుంచి చూపిస్తున్నారు. అదే ఆయన కొంప ముంచుతోంది. వాస్తవానికి పవన్ కల్యాణ్ మొదటి నుంచి ఒక నినాదం, ఒక సిద్ధాంత మీదనే ఆధార పడి ప్రజల కోసం పోరాడి ఉంటే కచ్చితంగా ఆయన్ను ప్రజలు ఆదరించేవారు. కానీ ఎప్పుడు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకుంటారో.. ఎప్పుడు ఏం మాట్లాడి దాన్ని చివరకు వదిలేస్తారో అనేది చెప్పలేం. అదే ఆయన కొంప ముంచుతోంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు భేషరతుగా మద్దతు తెలిపారు.
మరి చంద్రబాబుతో పొత్తులను అలాగే కంటిన్యూ చేస్తారా అంటే అదీ లేదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ లను బండ బూతులు తిట్టారు. ఇక జగన్ ను ఓడించాలని చాలానే ప్రయత్నాలు చేశారు. కానీ చివరకు ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు పవన్ కల్యాణ్. ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. కాబట్టి ఈ ఎన్నికల్లో పొత్తులు లేకపోతే కనీసం తాను కూడా గెలవలేనని పవన్ కల్యాన్ భావించారు. అందుకే ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఇక్కడ ఓ విషయాన్ని మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి. అదేంటంటే పవన్ కల్యాణ్ ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నారంటే దానికి కారణం కాపులు.
2019 ఎన్నికల సమయం నుంచి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. ఎలాంటి సభలు, సమావేశాలు పెట్టినా సరే వాటికి కాపులు మద్దతుగా నిలిచారు. ఇన్ని రోజులు తమ జేబుల్లో నుంచి కాపు నేతలు డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ పవన్ కోసం పని చేశారు. తమకే సీట్లు వస్తాయని ఆశలు కూడా పెట్టుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబుతో పొత్తులు పెట్టుకున్నారు. అప్పటి నుంచే కాపుల్లో అసహనం మొదలైంది. చంద్రబాబు తమను మోసం చేస్తాడనేది వారి వాదన. కానీ పవన్ కల్యాన్ మాత్రం మనకు గౌరవ ప్రదమైన సీట్లు, ప్రభుత్వంలో వాటా అంటూ చెప్పుకొచ్చారు.
తీరా మొన్న ఉమ్మడి అభ్యర్థుల మొదటి లిస్టు చూసి కాపులు షాక్ అయిపోయారు. 118 సీట్లకు టీడీపీ 94 సీట్లు తీసుకుంటే జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే ఇచ్చింది. ఇందులోనూ కాపు వర్గానికి వచ్చినసీట్లు మరీ దారుణం. ఇక చంద్రబాబు అయితే టీడీపీ నుంచి కాపు నేతలకు కేవలం ఏడు సీట్లు మాత్రమే ఇచ్చాడు. ఏపీ జనాభాలో 15 శాతం ఉన్న కాపులు పవన్ ను నమ్ముకుంటే తీరని దెబ్బ తగిలింది.
దాంతో ఇప్పుడు పవన్ తో తమకు భవిష్యత్ లేదని కాపులకు కూడా అర్థం అయిపోయింది. అందుకే ఇప్పుడు కాపు యువత కూడా పవన్ వెంట నడిచేందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాపుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. పవన్ ను నమ్ముకుంటే నట్టేట ముంచాడనేది వారి వాదన. మరి ముందు ముందు పవన్ తో వారు ఉంటారా ఉండరా అనేది ఈ ఎన్నికల్లోపు తేలిపోనుంది.





