Astrologer Venu Swamy : పవన్ కల్యాణ్‌ అప్పుడే విడాకులు తీసుకుంటాడు.. డేట్ తో సహా చెప్పేసిన వేణుస్వామి..!

Qubetvnews - February 17, 2024 / 08:04 AM IST

Astrologer Venu Swamy : పవన్ కల్యాణ్‌ అప్పుడే విడాకులు తీసుకుంటాడు.. డేట్ తో సహా చెప్పేసిన వేణుస్వామి..!

Astrologer Venu Swamy :

వేణుస్వామి అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన జ్యోతిష్యుడిగా చాలా పాపులర్ అయ్యారు. సినిమా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఆయన చెప్పిన వాటిల్లో చాలా వరకు నిజం కావడంతో ఆయనకు ఇంత ఫేమ్ దక్కింది. ఆయన చెప్పిన దాంట్లో అతిపెద్ద నిజం ఏంటంటే నాగచైతన్య-సమంత విడాకులు. వారి పెళ్లి జరిగినప్పుడే వారు విడాకులు తీసుకుంటారని వేణుస్వామి చెప్పి సంచలనం సృష్టించాడు. ఆయన చెప్పినట్టు గానే నాలుగేళ్ల తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఇక ఓ 40 ఏళ్ల హీరో గుండెపోటుతో చనిపోతాడని కూడా వేణుస్వామి ముందే చెప్పాడు. ఆయన చెప్పినట్టు గానే నందమూరి తారకరత్న చనిపోయాడు. ఇలాంటి సెన్సేషనల్ ఎన్నో ఉన్నాయి. అందుకే వేణుస్వమిని అందరూ అంతగా నమ్ముతుంటారు. ఇక ఆయనతో చాలా మంది హీరోయిన్లు పూజలు కూడా చేయిస్తుంటారు. రష్మిక మందన్నా వేణుస్వామితో పూజలు చేయించిన తర్వాతనే స్టార్ అయిందనే టాక్ ఉంది. అయితే అప్పుడప్పుడు వేణుస్వామి చేసే కామెంట్లు వివాదాస్పదం అవుతుంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పవన్ కల్యాణ్‌ మూడో భార్యతో విడాకులు.

గతేడాది ఈ విషయాన్ని వేణుస్వామి ప్రకటించి సంచలనం రేపాడు. పవన్ కల్యాణ్‌ కచ్చితంగా తన మూడో భార్యతో విడాకులు తీసుకుంటాడని ఆయన చెప్పినప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా వేణుస్వామిని బండ బూతులు తిడుతున్నారు. కాగా ఈ విషయంలో తాజాగా మరోసారి స్పందించాడు వేణుస్వామి. ఆయన తాజాగా మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ జాతకం ప్రకారం కచ్చితంగా మరోసారి విడాకులు అవుతాయని నేను చెప్పాను. అందులో నేను రాజీ పడట్లేదు. ఎందుకంటే శాస్త్రం ప్రకారమే నేను చెబుతున్నాను.

కాకపోతే ఆయనకు 2024లో విడాకులు కావు. ఈ ఏడాదిలో ఆయనకు చాలానే ఎదురు దెబ్బలు తగలబోతున్నాయి. కానీ అది సినిమాలు, రాజకీయ పరంగానే జరుగుతాయి. కాబట్టి పర్సనల్ గా ఆయనకు ఈ ఏడాది పెద్దా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ వచ్చే ఏడాది తర్వాత ఏమైనా జరగొచ్చు.

ఆయనకు విడాకులు తప్పవు అని చెప్పాడు. అంటే ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది కచ్చితంగా పవన్ కల్యాణ్‌ విడాకులు తీసుకుంటాడని చెబుతున్నాడన్న మాట. వేణుస్వామి ఇలాంటి కామెంట్లు చేయడంతో ఇప్పుడు ఆయనపై ఎలాంటి ట్రోలింగ్ వస్తుందో వేచి చూడాల్సిందే.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News