Pawan Kalyan : అయ్యో రామా.. జనసేనాని.. అలకబూని పర్యటనలు రద్దేంటి సామి ?

Qubetvnews - February 17, 2024 / 07:06 AM IST

Pawan Kalyan : అయ్యో రామా.. జనసేనాని.. అలకబూని పర్యటనలు రద్దేంటి సామి ?

Pawan Kalyan :

జన సేనాని పవన్ కళ్యాణ్ సినిమాల్లో పెద్ద హీరో. కానీ రాజకీయ జీవితంలో కమెడియన్ అని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ప్రత్యర్థుల విమర్శలకు బలం చేకూర్చేలా ఆయన రాజకీయ శైలి ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబును సీఎం చేస్తానని చెబుతున్న పవన్ ను ఎల్లో మీడియా నెత్తినెత్తుకున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నిక‌ల స‌మ‌యంలో వేడెక్కుతున్న రాజ‌కీయం.. ప‌వ‌న్ కామెడీ పుణ్యమాని వాతావరణం కాస్త ఆహ్లాదకరంగా మారుతోంది. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిన్న పిల్ల‌ల చేష్టలు చూసి స్వయానా ఆ పార్టీ శ్రేణులే న‌వ్వాలో ఏడవాలో తెలియ‌ని స్థితి. ఈ నెల 14నుంచి నాలుగు రోజుల పాటు ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌ర్యటించాలని భావించారు.

ఈ మేర‌కు ప‌వ‌న్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనైనా జ‌నంతో, అలాగే త‌న పార్టీ నాయ‌కుల‌తో సన్నిహితంగా ఉంటారని అంద‌రూ అనుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయ‌న భీమ‌వ‌రంలో ప‌ర్యటించాలని అనుకున్నారు. భీమ‌వ‌రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ హెలికాప్టర్ దిగ‌డానికి ఆర్ అండ్ బీ అధికారులు అనుమ‌తి నిరాక‌రించారు. దీంతో భీమ‌వ‌రం ప‌ర్యటన రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత పర్యటనలు మాత్రం య‌ధావిధిగా కొన‌సాగుతాయ‌ని సదరు జనసేన పార్టీ ప్రకటించింది. భీమ‌వ‌రం పర్యటన రద్దైనా, త‌మ ప్రాంతాల‌కు వ‌స్తున్నాడ‌నే జ‌న‌సేన నాయ‌కులు, కార్యకర్తల సంతోషం కాసేపైనా నిలువలేదు. చావు క‌బురు చ‌ల్ల‌గా జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి పి.హ‌రిప్ర‌సాద్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

“జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో నాలుగు రోజులపాటు చేపట్టాల్సిన పర్యటన వాయిదా పడింది. పవన్ ప్రయాణించే హెలికాప్టర్ దిగేందుకు అనుమతుల విషయంలో ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆర్ అండ్ బి అధికారుల ద్వారా అనుమతులకు సాకులు చూపిస్తున్నారు. భీమవరంలో ఇదే ఇబ్బందులు తీసుకురావడంతో పర్యటన వాయిదా వేశారు. కాకినాడలో సమావేశానికి ఆ నగరంలో ఉన్న హెలిపాడ్ కోసం అనుమతి కోరితే అంగీకరించలేదు. అక్కడికి 30 కి.మీ. దూరంలో ఉన్న గొల్లప్రోలులో దిగాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి అవాంతరాలు కల్పిస్తుండటంతో పర్యటన వాయిదా వేయాలని నిర్ణయించారు. అనుమతుల విషయంలో ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని పార్టీ లీగల్ సెల్ కు పవన్ సూచించారు”

పవన్ పర్యటనను వైసీపీ అడ్డుకోవాలని భావిస్తుందని అనుకుందాం. ఆ పార్టీ ఆలోచనలకు తగినట్లే మరి జనసేన పార్టీ వ్యవహారశైలి ఏమిటి? కాకినాడకు 30 కి.మీ దూరంలో హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడానికి అనుమతిస్తే అలకపాన్పు వేయడం ఏంటి.. నిజానికి పర్యటించాలన్న సంకల్పం ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కొని తీరాల్సిందే. జగన్ వెంట పడి తమకే నష్టం చేస్తున్నారని జనసేనాని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎక్కువ కాలం క్షేత్ర పర్యటనలకు వెళ్లకపోవడానికే పవన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. నాలుగు రోజుల పర్యటనలు రద్దు చేసుకుని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవే సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒక పార్టీ నుంచి నిధులు రాకపోవడంతో ఈ పర్యటనలు రద్దయ్యాయని జనసేన నేతలు ఆఫ్ ద రికార్డ్ చెప్పినట్లు తెలిసింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News