Pawan kalyan : పవన్ మీద రగిలిపోతున్న ఏపీ బీజేపీ నేతలు.. ఇంత అవమానమా..?
Qubetvnews - March 11, 2024 / 10:41 AM IST
Pawan kalyan : ఏపీలో ఇప్పుడు పొత్తుల వ్యవహరాలు నడుస్తున్నాయి. ఒక్క జగన్ ను ఓడించేందుకు అన్ని పార్టీలు ఒక్కటైపోతున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు రెడీ అయిపోయాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో పొత్తులు పెట్టుకుంది. ఇటు చంద్రబాబు పవన్ కల్యాణ్ తో కలిసి పొత్తులు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు వీరికి జోడీగా బీజేపీ పార్టీ కూడా వచ్చి చేరింది. కాగా టీడీపీ-జనసేన కూటమితో పొత్తులు పెట్టుకోవడానికి బీజేపీతో మంతనాలు జరిపింది మాత్రం పవన్ కల్యాణ్. అయితే ఇక్కడే పవన్ కల్యాణ్ ఏపీ బీజేపీ నేతలను దారుణంగా అవమానించాడని అంటున్నారు ఆ పార్టీ నేతలు.
2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి పవన్ కల్యాణ్ తన అవసరాల కోసం ఎన్డీయేలో చేరారు. కానీ ఏనాడూ కూడా ఎన్డీయేలో పార్టీ నేతగా వ్యవహరించలేదు. ఇంకా చెప్పాలంటే స్టేట్ బీజేపీ నేతలతో ఆయన ఎన్నడూ కలిసి ఒక మీటింగ్ కూడా పెట్టలేదు. వారిని ఎన్నడూ కలుపుకుని పోలేదు. ఏపీ బీజేపీ నేతలను ఇన్ని రోజులు పవన్ కల్యాణ్ పక్కన పెట్టేసి సొంత రాజకీయాలు చేశారు. ఇప్పుడు పొత్తులు కూడా అలాగే కుదరిపోయాయి. ఢిల్లీ పెద్దలతో మాట్లాడటానికి ముందు వాస్తవానికి లోకల్ లీడర్లతో మంతనాలు జరపాలి. కానీ పవన్ ఆ పని చేయకుండా ఏపీ బీజేపీ నేతలకు కనీస విలువ ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి.
ఏపీ బీజేపీ నేతలను కలవకుండానే నేరుగా ఢిల్లీ పెద్దలను కలిసి పొత్తులు పెట్టుకున్నారు పవన్ కల్యాణ్. ఈ విషయాన్ని కూడా బీజేపీ నేతలతో కలిసి చెప్పలేదు. స్వయంగా వెల్లడించారు. అయితే దొరికిందే సందు అన్నట్టు చంద్రబాబు కూడా పవన్ కు బీజేపీకి ముడి పెట్టేశారు. ఈ రెండు పార్టీలకు కలిపి 30 ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లు ఇస్తా.. అంతకు మించి ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పేశారు. అంతే కాకుండా ఆ సీట్లలో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది కూడా బీజేపీ జనసేన తేల్చుకోవాలని చెబుతున్నారు. ఈ విషయమే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీటు పుట్టిస్తోంది.
అయితే సీట్ల పంపకాల కోసం ఢిల్లీ నుంచి వచ్చిన బైరాన్ సింగ్ షెకావత్ తో మంతనాలు జరిపారు పవన్. అంతే గానీ సీట్ల పంపకాల విషయంలో కూడా ఏపీ బీజేపీ నేతలను కలిసి మాట్లాడలేదు. దీన్ని బట్టి అసలు ఏపీ బీజేపీ నేతలను పవన్ ఏ మాత్రం గౌరవిస్తున్నారో అర్థం అవుతోందని అంటున్నారు రాజకీయ వర్గాలు.
ఈ విషయంపై బీజేపీ నేతలు రగిలిపోతున్నారు. తమకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా దారుణంగా అవమానిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇంత దారుణంగా ఉంటే.. రేపు ఎన్నికల్లో ఇంకెలా తమను పక్కన పెడుతారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ మీద.




