Pawan Kalyan : మాచర్ల ఘటనపై జనసేన సైలెంట్.. టీడీపీ పాపలు మనకొద్దంటున్న పవన్..!

Qubetvnews - May 25, 2024 / 01:32 PM IST

Pawan Kalyan : మాచర్ల ఘటనపై జనసేన సైలెంట్.. టీడీపీ పాపలు మనకొద్దంటున్న పవన్..!

Pawan Kalyan : మాచర్ల ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఏపీలో విధ్వంసానికి అద్దం పట్టేలా ఉంది. 2024 ఎన్నికలు అంటే ఇంకో యాభై ఏళ్లు వచ్చినా సరే మాచర్ల ఘటననే అందరికీ ముందుకు వచ్చేలా ఉంది. అంత దారుణంగా అక్కడ విధ్వంసం చెలరేగింది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్నారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన వీడియో లీక్ పై అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే ఆయన అంత ఆగ్రహానికి గురి కావడానికి చాలానే కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే మాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

అయితే మాచర్ల ఘటనపై అటు టీడీపీ సైలెంట్ గా ఉందంటే దానికి కారణం ఉంది. ఎందుకంటే తప్పు వారిదే కాబట్టి వారు సైలెంట్ గా ఉన్నారనే వాదన వినిపిస్తోంది. కాగా టీడీపీ మిత్ర పక్షం అయిన జనసేన మాత్రం ఈ ఘర్షణలపై సైలెంట్ గానే ఉండిపోయింది. ఇందుకు అనేక కారణాలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే మాచర్లలో పాల్వాయి గేట్ వద్ద ఈవీఎం ధ్వంసంతో పాటు ఆ నియోజకవర్గంలో జరిగిన కొన్ని హింసాత్మక ఘటనల వల్లనే ఎమ్మెల్యే పిన్నెల్లి అంత ఆగ్రహానికి గురయ్యారని అంతా నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని జనసేన కూడా విశ్వసిస్తోంది.

టీడీపీ శ్రేణులు మాచర్లలో చాలా చోట్ల రిగ్గింగ్ లకు పాల్పడ్డారని.. టీడీపీ కార్యకర్తలు కొందరు దొంగ ఓట్లు కూడా వేశారని మీడియాలో అటు సోషల్ మీడియాలో బలంగా వస్తున్న వార్తలను జనసేనాని పవన్ కల్యాణ్‌ కూడా బలంగా నమ్మతున్నారు. అందుకే వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ చేసిన తప్పులకు మనం ఎందుకు జవాబు చెప్పాలని పవన్ కల్యాణ్‌ డిసైడ్ అయినట్టు ఉన్నారు. అందుకే టీడీపీ తప్పులను మనం సమర్థించాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు ఇప్పటికే ఆర్డర్లు వేశారంట. అందుకే ఈ ఘటనపై జనసేన సైలెంగ్ గా ఉండిపోయింది.

పవన్ కల్యాణ్‌ సైలెంట్ ఆదేశాలతో మాచర్లలో కూడా జనసేన నాయకులు తమకు టీడీపీ తప్పులతో సంబంధం లేదన్నట్టు సైలెంట్ గానే ఉంటున్నారు. టీడీపీ చేసిన విధ్వంస కాండను చూసి తమకు ఏం పట్టనట్టు ఉంటున్నారు జనసేన నాయకులు. అందుకే మాచర్లలో ఇప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు.

మాచర్ల నియోజకవర్గంలో జరిగిన టీడీపీ అరాచక విధ్వంసంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే జనసేన నేతలు పలు మీడియా సంస్థలతో చెప్పేస్తున్నారంట. అందుకే ఈ విషయంలో జనసేన సైలెంట్ గా ఉండటాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని తెలుస్తోంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News