Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ కు ఆ పదవి వస్తే సినిమాలు మానేస్తారా..?

Qubetvnews - June 8, 2024 / 07:56 PM IST

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ కు ఆ పదవి వస్తే సినిమాలు మానేస్తారా..?

Pawan Kalyan : ఏపీలో ఇప్పుడు కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే ఆ కూటమిలో ప్రధాన పార్టీగా అధినేతగా ఉన్న చంద్రబాబు కంటే కూడా పవన్ కల్యాణ్‌ పేరు బలంగా వినిపిస్తోంది. ఒక రకంగా ఆయనను అంతా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అంటున్నారు. ఆయన వల్లే కూటమి గెలిచిందని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఇంకోవైపు ప్రధాని నరేంద్రమోడీ సైతం పవన్ కల్యాణ్‌ ను తుఫాన్ అంటూ పొగిడేశారు. దాంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పవన్ పేరు మార్మోగుతోంది. అమాంతం ఆయన క్రేజ్ డబుల్ అయిందని అంటున్నారు.

అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో జనసేనది ప్రధాన పాత్ర కాబట్టి.. పవన్ కల్యాణ్‌ కు కచ్చితంగా కీలక పదవి ఖాయం అంటున్నారు. ఇప్పటికే ఆయనకు డిప్యూటీ సీఎం ఇస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే అదే జరిగితే ఆయన అభిమానులకు మాత్రం పెద్ద షాక్ తగులుతుందని చెప్పుకోవచ్చు. అదేంటి పవన్ కు కీలక పదవి వస్తే ఆయన ఫ్యాన్స్ కు సంతోషమే కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఓ పాయింట్ ఉంది. అదేంటంటే.. ఏపీ ప్రభుత్వంలో పవన్ పనిచేస్తే సినిమాలకు సమయం కేటాయించడం కుదరదు. అంటే ఆయన సినిమాలకు దూరం కావచ్చు అంటున్నారు.

అటు ప్రభుత్వంలో పనిచేస్తూ ఇటు సినిమాలు చేయడం అన్నది ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. అది సాధ్యం కాదు కూడా. కేబినెట్ మినిస్టర్ అయినా కూడా సినిమాలు చేయడం కష్టం అవుతుంది. ఒకవేళ ఏదో ఒక సమయం కేటాయించుకుని చేద్దామనుకున్నా.. ప్రజలకు పని చేయకుండా సినిమాలు చేసుకుంటున్నారని ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తాయి. పైగా ఇన్ని రోజులు ప్రజలకు సేవచేసే అవకాశం కోసమే పవన్ కల్యాణ్‌ ఎదురు చూశారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఆయన సంపూర్ణంగా వినియోగించుకోవాలని భావిస్తున్నారంట.

అందుకే ఆయన సినిమాలు మానేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓజీ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే సెట్స్ మీద ఉన్నాయి. ఇవి పూర్తయిన తర్వాత ఆయన సినిమాలు చేయడం మానేయాలని చూస్తున్నారంట. అందుకే కొత్త సినిమాలను కూడా ఒప్పుకోలేదని తెలుస్తోంది.

ఒకవేళ పవన్ కల్యాణ్‌ ప్రభుత్వంలో కాకుండా ప్రధాన ప్రతిపక్ష హోదాను తీసుకుంటే అప్పుడు అడపాదడపా సినిమాలు చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్‌ ఎన్డీయే కూటమిలో ఉన్నారు కాబట్టి.. ప్రతిపక్ష హోదాను తీసుకుంటారా అంటే అనుమానమే. కాబట్టి పవన్ ఫ్యాన్స్ కు షాక్ తప్పేలా లేదు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News