Pawan Kalyan : పవన్ మీదనే అందరి ఆశలు.. ఏం చేస్తాడో..?
Qubetvnews - June 15, 2024 / 08:46 PM IST
Pawan Kalyan : ఇప్పుడు ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది అనడం కన్నా.. పవన్ కల్యాణ్ వల్లే వచ్చింది అనడమే కరెక్ట్ అనేది రాజకీయ నిపుణులతో పాటు కూటమి లోని చాలా మంది మాట. అంతెందుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పవన్ వల్లే ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది అన్నాడంటే ఆయన ఇమేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఏపీలో అందరి పాలన చూసేశారు ప్రజలు. చంద్రబాబును మూడు సార్లు ముఖ్యమంత్రిగా చూశారు. జగన్ ను కూడా ఒకసారి సీఎంగా చూశారు. కాబట్టి వారి పాలన ఎలా ఉంటుంది అనేది ప్రజలకు అర్థం అయిపోయింది.
అయితే ఇప్పుడు ఎటొచ్చి పవన్ కల్యాణ్ మీదనే చాలా ఆశలు ఉన్నాయి జనాలకు. ఎందుకంటే పవన్ కల్యణ్ తన ప్రతి స్పీచ్ లో కూడా ప్రజలకు అది చేస్తా.. ఇది చేస్తా.. డబ్బుల కోసం రాలేదు.. సినిమాల్లో వందల కోట్లు వదులుకుని ప్రజలకు సేవ చేసేందుకు వచ్చా అంటూ ఎన్నో మాటలు చెప్పారు. అంతే కాకుండా గెలిచినప్పటి నుంచి ఆయన కక్ష సాధింపు చర్యలకు అధికారం కాదని.. కేవలం ప్రజలకు సేవ చేయడానికే అని.. ఐదు కోట్ల మంది ఆశలను నిజం చేస్తానంటూ చెబుతున్నారు. అందుకే ఇప్పుడు పవన్ కల్యాణ్ మీదనే అందరి చూపు ఉందని చెప్పుకోవాలి.
పవన్ కల్యాణ్ గెలిస్తే ఏదో చేస్తాడు అని అంతా ఇన్ని రోజులు అనుకున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది కాబట్టి పవన్ కల్యాణ్ చర్యలు ఎలా ఉంటాయి, ఎలాంటి పాలన అందిస్తాడు.. ప్రజల్లోకి వస్తాడా రాడా.. ప్రజల సమస్యలపై ఒకే ఒక్కడు సినిమాలో మాదిరి రాష్ట్రమంతా తిరుగుతాడా అనేది అందరిలోనూ ఆలోచనలు ఉన్నాయి. కాగా పవన్ కల్యాణ్ ఇప్పటికిప్పుడు ఏమీ చేయకపోయినా.. ఈ ఐదేండ్లలో ఏం చేస్తాడనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రబాబును కాదని పవన్ ఏమీ చేయలేకపోవచ్చు. కానీ చంద్రబాబును మించి పవన్ కల్యాణ్ మీదనే చాలా మందికి ఆశలు ఉన్నాయి.
చంద్రబాబును ఒప్పించి అయినా సరే ఏదో ఒకటి చేస్తాడని నమ్ముతున్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు కంటే కూడా పవన్ కల్యాణ్ మీదనే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. మరి పవన్ కల్యాణ్ ఈ ఐదేండ్లు తానేంటో నిరూపించుకోకపోతే మాత్రం.. సీఎం కాకుండానే ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తు పెట్టుకోవాలి. ఒక రకంగా ఆయన సీఎం కాక ముందే ఆ స్థాయి అంచనాలను నిలబెట్టుకోలేడనే విమర్శలు మాత్రం ఆయన మూటగట్టుకోవాల్సి వస్తుంది.



