Chandrababu : బీజేపీతో పొత్తు ఆర్ ఎస్ ఎస్ కు ఇష్టం లేదా.. బాబు ఆశలు గల్లంతేనా..?

Qubetvnews - March 17, 2024 / 02:47 PM IST

Chandrababu : బీజేపీతో పొత్తు ఆర్ ఎస్ ఎస్ కు ఇష్టం లేదా.. బాబు ఆశలు గల్లంతేనా..?

Chandrababu : చంద్రబాబు నాయుడు మొదటి నుంచి పొత్తు రాజకీయాలే చేస్తున్నారు. ఆయన ఎప్పుడూ కూడా పొత్తులు లేకుండా పోటీ చేసి గెలిచిన సందర్భాలు లేవు. ప్రతి ఎన్నికల్లో సొంత వ్యూహాలను పక్కన పెడుతుంటారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని.. ఎవరితో అయితే గెలుస్తామో వారిని చేరదీస్తుంటారు. ఇదే ఆయన మొదటి నుంచి వేస్తున్న ఎత్తుగడ. ఇప్పుడు కూడా రాబోయే ఎన్నికల కోసం మరోసారి పొత్తులు పెట్టుకున్నారు. ఈసారి కూడా బీజేపీతో పొత్తులో ఉన్నారు. వాస్తవానికి చంద్రబాబు ఎక్కువ సార్లు పొత్తులు పెట్టుకున్నది కూడా బీజేపీ పార్టీతోనే.

1999, 2004, 2014ల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. మ‌ర‌లా 2018లో ఆ పార్టీతో విభేదించి 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా వెళ్ళి బొక్క‌బోర్లా ప‌డ్డాడు. ఇప్పుడు మ‌రోసారి ఢిల్లీలో బీజేపీ పెద్ద‌ల కాళ్ళావేళ్ళా పడి పొత్తుకు ఒప్పించుకున్నాడు. అయితే చంద్రబాబు ఇన్ని పాట్లు పడి బీజేపీకి ఎన్నో కొన్ని సీట్లు ఇచ్చేసి అధికారంలోకి వద్దామని అనుకుంటే.. ఇప్పుడు ఆయనకు ఎదురు దెబ్బలు తగిలేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అసలు టీడీపీతో పొత్తులు ఆర్ ఎస్ ఎస్ పెద్దలకు అస్సలు ఇష్టం లేదు. బీజేపీ పార్టీ ఆర్ ఎస్ ఎస్ సూచనలతోనే నడుస్తుంది. సంఘ్ పెద్దలకు ఇష్టం లేకుండా బీజేపీ ఎలాంటి ముందడుగు వేయలేదు.

ఇప్పుడు సంఘ్ పెద్దలు వ్యతిరేకించడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. చంద్రబాబుకు అవసరం ఉన్నప్పుడు బీజేపీతో పొత్తులు పెట్టుకుంటున్నాడు.. అవసరం తీరిపోగానే బయటకు వెళ్లి తిడుతాడు అనేది ఆర్ ఎస్ ఎస్ పెద్దల అనుమానం. ఎందుకంటే 2018లో ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వెళ్ళిన త‌ర్వాత ప్ర‌ధాని మోదీపై చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను వారు ఇంకా మ‌ర్చిపోలేకున్నారు. వీట‌న్నింటికీ మించి పొత్తు కుదిరిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ సోష‌ల్‌మీడియాలో టీడీపీ అభిమానులు ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షాల‌పై కామెంట్లు చేస్తున్నారు. అందుకు దీటుగా బ‌దులిస్తున్నారు బీజేపీ అభిమానులు.

కాబట్టి దీన్ని బట్టి చూస్తుంటే అసలు టీడీపీతో పొత్తు ఇటు ఏపీ బీజేపీ నేతలు, కార్యకర్తలకే కాకుండా అటు ఆర్ ఎస్ ఎస్ నేతలకు కూడా అస్సలు ఇష్టం లేదని తెలుస్తోంది. అటు పవన్ కల్యాణ్‌, జనసేన కూడా తమ వల్లే బీజేపీతో పొత్తులు కుదిరాయని జబ్బలు చరుచుకుంటున్నారు.

దాంతో టీడీపీ కార్యకర్తలు అటు జనసేన మీద కూడా విమర్శలు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు టీడీపీ మీద అటు బీజేపీ, ఇటు జనసేన కార్యకర్తలు, నేతలు ఆగ్రహంగానే ఉన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బీజేపీ నేతలు సహకరిస్తారనే నమ్మకం లేదని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News