AP Pensions : ఫస్ట్ వచ్చింది ఇంకా పెన్షన్ రాలేదు… బ్యాంకులకు వెళ్లాలా అని అవ్వాతాతల కలవరం
Qubetvnews - May 1, 2024 / 12:37 PM IST
AP Pensions :
ఏపీలో ప్రతి నెలా 1వ తేదీ రాగానే నవ్వుతూ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని పెద్దమ్మా బాగున్నావా.. తాతా బాగున్నావా అని పలకరించే వాలంటీర్ ఈ నెల కూడా ఇంటికి రాలేదు. వాలంటీర్ వచ్చి ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తున్న అవ్వా తాతలకు ఈనెల కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. వాలంటీర్ వచ్చి డబ్బులిస్తే మందులు… పప్పు ఉప్పు…సరుకులు కొనుక్కుందాం అనుకున్న అవ్వ తాతలు ఉసూరుమంటున్నారు. ఈ ఎండలకు బ్యాంకులకు వెళ్లాలా, ఇంకెక్కడికి వెళ్లాలి అంటూ బిక్కు బిక్కుమంటున్నారు. ఇన్నాళ్లు సాఫీగా సాగిన పింఛన్ డబ్బుల పంపిణీ ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యిందని వారు ఆందోళన చెందుతూ ఆలోచిస్తున్నారు.
వాలంటీర్ రాలేదు… చేతిలోకి పైసలు పడలేదు…ఈ ఎండల్లో ఆటోల్లో పక్కూరు వెళ్లి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవాలట. ఈ మండుటెండలో ఎలా వెళ్లాలో ఏమో అంటూ వృద్ధులు.. వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు వేసిన ఎత్తులు, కుట్రల వల్ల వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. అవ్వలకు, తాతలకు బ్యాంకుకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం సాధ్యం అయ్యే పనేనా. ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చే వ్యవస్థకు అలవాటు పడ్డ అవ్వలు బ్యాంకుకు వెళ్లమంటే ఏం అవుతారు. అసలు బ్యాంక్ లు అంటే కూడా తెలియని వారు ఉన్నారు. అలాంటి వారి పరిస్థితి ఏంటి.. వచ్చే కొద్దిపాటి పింఛన్ కోసం వందల రూపాయలు వారికి వీరికి ఇచ్చి బ్యాంకు కు వెళ్లి రావాల్సిన పరిస్థితి ఏర్పడితే మాకు చేతిలో మిగిలేది ఎంత అంటూ అవ్వాతాత కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Senior Citizens Are Struggling Get Pension In AP
అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా ? ఆ బ్యాంకుల్లో క్యూలైన్లు..నిలబడడం..ఆ ఫారాలు నింపడం ..ఇదంతా పెద్ద సమస్య.. దానికి తోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ లేకపోతె కొంత పెనాల్టీ విధిస్తాయి. ఈ పేదల ఖాతాల్లో నిత్యం మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే… అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ళ ఖాతాల్లోకి వచ్చిన మూడు వేలలో కొంత కోత విధిస్తే అది తమకు నష్టం అని వారు ఆందోళన చెందుతున్నారు.
ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్లు పంచడాన్ని అయన భరించలేక … సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మంచిపేరు రావడాన్ని సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని, రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు. ఈ ఒక్క నెల కష్టపడుతూ ఏదో విధంగా పింఛన్ తీసుకుంటే వచ్చే నెల నుంచి మళ్లీ జగన్ సీఎం అయితే మునుపటి మాదిరిగా వాలంటీర్లు ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తారు.




