Chandrababu : నీకొక రూల్.. మాకొక రూలా.. చంద్రబాబుపై టీడీసీ సీనియర్ల ఆగ్రహం..!

Qubetvnews - March 23, 2024 / 01:46 PM IST

Chandrababu : నీకొక రూల్.. మాకొక రూలా.. చంద్రబాబుపై టీడీసీ సీనియర్ల ఆగ్రహం..!

Chandrababu : చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టు తయారైంది. ఎందుకంటే ఆయన మీద ఇప్పుడు పార్టీ సీనియర్లే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మొన్నటి వరకు అందరినీ కలుపుకుని పోయినట్టే కనిపించినా.. ఇప్పుడు సీట్ల పంపకానికి వస్తే మాత్రం చంద్రబాబును అందరూ తిట్టుకుంటున్నారంట. అసలు పొత్తులు ఎవడు పెట్టుకోమన్నాడు.. మాకెందుకు అన్యాయం చేస్తున్నారు అంటూ టికెట్ రాని వారంతా రగిలిపోతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు చంద్రబాబు తన పార్టీకి ఓ రూల్ ను పెట్టుకున్నారు.

అందేంటంటే.. కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ కేటాయిస్తామని. కానీ తన కుటుంబం వరకు వచ్చేసరికి మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు కుటుంబంలో నాలుగు టికెట్లు ఇచ్చుకున్నారు. కుప్పం నుంచి చంద్రబాబుకు, మంగళగిరి నుంచి లోకేష్ కు, హిందూపురం నుంచి బాలకృష్ణకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించుకున్నారు. ఇక లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ చిన్నల్లుడు గీతం భరత్ కు విశాఖ ఎంపీ టికెట్ ను కేటాయించారు. వాస్తవానికి విశాఖ ఎంపీ టికెట్ ను బీజేపీ ఆశించింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహన్ అక్కడ ఎంపీగా పోటీ చేయాలని బాగానే పని చేశారు.

కానీ ఆ టికెట్ చంద్రబాబు తన కుటుంబానికి కేటాయించుకున్నారనేది బీజేపీ వాదన. ఇక చంద్రబాబు పెట్టిన కుటుంబానికి ఒకటే టికెట్ అనే రూల్ వల్ల చాలా సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. రాయలసీమలో జేసీ, పరిటాల కుటుంబాలు ఇదే విషయంలో భగ్గుమంటున్నాయి. చంద్రబాబు మాత్రం నాలుగు టికెట్లు ఇచ్చుకుని తమకు ఒకటే టికెట్ ఇవ్వడం ఏంటని పరిటాల సునీత మండిపడుతున్నారు. వాస్తవానికి ఆమె కొడుకు పరిటాల శ్రీరామ్.. ధర్మవరం నుంచి పోటీ చేయాలని భావించాడు. కానీ ఆ టికెట్ ను బీజేపీకి చంద్రబాబు కేటాయిస్తున్నట్టు సమాచారం.

కానీ మైలవరం సూరికి టికెట్ కేటాయించేందుకు చంద్రబాబు ఇలాంటి ప్లాన్ వేస్తున్నారని పరిటాల కుటుంబం ఆగ్రహంగా ఉంది. అటు జేసీ బ్రదర్స్ కుటుంబం వాదన కూడా ఇలాగే ఉంది. వారిది వర్ణనాతీతమైన బాధ. ఎందుకంటే జేసీ పవన్ కు అనంతపురం ఎంపీ టికెట్ అడిగారు.

కానీ చంద్రబాబు ఇవ్వలేదు. దాంతో జేసీ దివాకర్ రెడ్డి, పవన్ చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. మాకు టికెట్లు ఇవ్వకుండా చంద్రబాబు మాత్రం నాలుగు టికెట్లు ఇచ్చుకోవడం ఏంటో చెప్పాలంటూ వారు ఆయన మీద మండిపడుతున్నారు. ఇలా చంద్రబాబు రూల్ పెట్టి పాటించకపోవడంతో సీనియర్లు గుస్సా అవుతున్నారు. మరి వారు ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడే పరిస్థితి అయితే కనిపించట్లేదు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News