Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ ను నేరుగా సైడ్ చేసేస్తున్న టీడీపీ.. ఆయన కోసమేనట..!
Qubetvnews - May 25, 2024 / 05:20 PM IST
Jr Ntr : చాలా రోజులుగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మధ్య ఓ వార్ నడుస్తోంది. టీడీపీ పనైపోయిందని.. ఆ పార్టీని చంద్రబాబు ఇక నడిపించలేకపోతున్నాడు కాబట్టి సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పార్టీ పగ్గాలు తీసుకోవాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. దాంతో నారా వారి ఫ్యామిలీ ఫుల్ సీరియస్ గానే ఉంది. ఎందుకంటే ఇన్నేళ్లు పార్టీని నడిపిస్తోంది తామే కాబట్టి చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్ కే పగ్గాలు ఇవ్వాలనేది నారా మద్దతు దారుల నుంచి డిమాండ్. ఈ క్రమంలోనే గత మూడేండ్లుగా జూనియర్ ఎన్టీఆర్ నినాదం టీడీపీలో నానాటికి పెరిగిపోతూనే వస్తోంది.
ఈ క్రమంలోనే చాలా రోజులుగా టీడీపీ మీటింగుల్లో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, ఫోటోలు కూడా ఆయన ఫ్యాన్స్ అయిన టీడీపీ కార్యకర్తలు ప్రదర్శిస్తున్నారు. దాంతో చంద్రబాబు వీటిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. తన మీటింగుల్లో గానీ, టీడీపీ మీటింగుల్లో గానీ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించొద్దంటూ హుకుం జారీ చేశారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టీడీపీ మీటింగులకు రానివ్వట్లేదు. అంతే కాకుండా ఎన్టీఆర్ ను కూడా సీనియర్ ఎన్టీఆర్ శత జయంతికి రానివ్వలేదు. అంతే కాకుండా టీడీపీ కార్యక్రమాలన్నింటికీ దూరంగానే ఉంచుతున్నారు. దీనికి కారణం ఎన్టీర్ వస్తే లోకేష్ ను ఎవరూ పట్టించుకోరని.
ఇక మొన్నటి ఎన్నికల్లో జనసేనతో పొత్తులు పెట్టుకున్న టీడీపీ.. ఇప్పుడు ఎలాగైనా అధికారంలోకి వస్తామనే ఆలోచనలో ఉంది. ఎన్నికల పోలింగ్ సరళిపై చంద్రబాబుకు పవన్ కు పెద్దగా నమ్మకం లేకుండా పోయింది. కాబట్టి అధికారంలోకి వస్తే ఎవరు పార్టీకి అధ్యక్షులుగా ఉన్నా నడుస్తుంది. అదే ప్రతిపక్షంలో ఉంటే మాత్రం కచ్చితంగా సమర్థుడే పార్టీకి అధ్యక్షుడిగా ఉండాలి. చంద్రబాబుకు వయసైపోతోంది కాబట్టి ఆయన ఎక్కువగా బయట తిరగలేకపోతున్నారు. కాబట్టి లోకేష్ కు పార్టీ పగ్గాలు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు పగ్గాలు ఇచ్చే ముందే జూనియర్ ఎన్టీఆర్ ను పోటీలో లేకుండా చేయాలని చూస్తున్నట్టు ఉన్నారు.
అందుకే తాజాగా టీడీపీ సీనియర్ లీడర్ అయిన బుద్ధా వెంకన్న తాజాగా ఓ టీవీ డిబేట్ లో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీకి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. గత 2014, 2019, 2024 ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఎన్టీఆర్ వచ్చి పార్టీ తరఫున ప్రచారం చేయలేదని.. కాబట్టి ఆయనకు పార్టీకి సంబంధం లేదని తెగేసి చెప్పారు.
ఇక ఇప్పట్లో చంద్రబాబుకు గానీ, లోకేష్ గానీ టీడీపీలో ఎవరూ సాటిలేరని.. పార్టీని వారు సమర్థంగా నడిపిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇలా టీడీపీ సీనియర్ నేతలు చెబుతున్నారంటే దీని వెనకాల చంద్రబాబు వ్యూహం కచ్చితంగా ఉండొచ్చని అంటున్నారు. దానిపై జూనియర్ అభిమానులు భగ్గుమంటున్నారు. టీడీపీ నందమూరి కుటుంబానిదే అని తేల్చేస్తున్నారు.
