Jr Ntr : మహిళ చేతిలో మోసపోయిన జూనియర్ ఎన్టీఆర్.. హైకోర్టులో కేసు..!
Qubetvnews - May 17, 2024 / 05:14 PM IST
Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ ఒక మహిళ చేతిలో మోసపోయారంటే నమ్ముతారా.. అస్సలు నమ్మలేరు కదా.. ఎందుకంటే ఆయన ఓ పెద్ద స్టార్ హీరో. ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి. అలాంటి స్టార్ హీరోను మోసం చేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఓ మహిళ ఆయన్ను తెలివిగా మోసం చేసింది. దాంతో ఆమె మీద హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు ఈ విషయమే హాట్ టాపిక్ అయిపోయింది. అసలు విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఒక ఫ్లాట్ కొన్నారు. అయితే ఈ ఫ్లాట్ కొన్న సమయంలో ఓ పెద్ద సీక్రెట్ ను దాచిపెట్టింది గీత లక్ష్మీ.
ఈ ఫ్లాట్ మీద 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా గీతలక్ష్మి కుటుంబం లోన్స్ తీసుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు బ్యాంకుల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకుంది గీత లక్ష్మీ. కానీ ఈ విషయాన్ని దాచిపెట్టి జూనియర్ ఎన్టీఆర్ కు ప్రాపర్టీ అమ్మేసింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ కు ఒక్క చెన్నైలో ఉన్న బ్యాంకులో మాత్రమే లోన్ ఉన్నట్టు చెప్పింది. కానీ మిగతా నాలుగు బ్యాంకుల్లో ఉన్న లోన్ సంగతి దాచిపెట్టింది. అయితే ఆ చెన్నై బ్యాంక్ లోన్ ను క్లియర్ చేసి తారక్ డాక్యుమెంట్స్ తీసుకున్నారు.
దాంతో 2003 నుంచి ఆ ఫ్లాట్ కు ఓనర్ గా మారిపోయారు ఎన్టీఆర్. కానీ అప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయి. గీత లక్ష్మీ లోన్ తీసుకున్న బ్యాంకు అధికారులతో వివాదం నడుస్తూనే ఉంది. ఈ ఫ్లాట్ ను స్వాధీనం చేసుకునేందుకు చాలా సార్లు బ్యాంకు అధికారులు ప్రయత్నాలు చేశారు. దాంతో ఆ బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు కంప్లయింట్ చేశారు ఎన్టీఆర్. ఇక 2019లో ఇదే ఇష్యూ మీద పోలీసులు ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు. కానీ DRT లో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు జూనియర్.
జూన్ 3 లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హై కోర్టు ఆదేశించింది. జూన్ 6న విచారణ చేపడతామన్న హైకోర్టు తెలిపింది. ఇదే సమస్య మీద జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు హైకోర్టుకు వెళ్లారు. దాంతో ఆయనకు ఏం జరిగిందో తెలియక ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక మహిళ చేతిలో ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరో మోసపోవడం ఏంటని అంతా షాక్ అవుతున్నారు. అయితే తమ హీరోకు అన్యాయం జరిగిందని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ కు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ విషయం మీద ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఏమీ మాట్లాడలేదు.
