Ys Jagan : మరో ప్రచార అస్త్రాన్ని తయారు చేస్తున్న జగన్.. ప్రతిపక్షాలకు దబిడి దిబిడే..!

Qubetvnews - March 26, 2024 / 09:52 PM IST

Ys Jagan : మరో ప్రచార అస్త్రాన్ని తయారు చేస్తున్న జగన్.. ప్రతిపక్షాలకు దబిడి దిబిడే..!

Ys Jagan : ఏపీ ఎన్నికల్లో అప్పుడే వైసీపీ దూసుకుపోతోంది. జగన్ వ్యూహాలతో ప్రజల్లో వైసీపీకి రోజు రోజుకూ క్రేజ్ పెరుగుతుందని నేతలు చెబుతున్నారు. అటుజగన్ కూడా పక్కా వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో దూసుకుపోయింది వైసీపీ పార్టీ. ఒకదానికి మించి మరొక సిద్ధం సభ భారీ ఎత్తున సక్సెస్ అయిపోయింది. దాంతో అప్పటి నుంచే జగన్ ఇలాగే ప్రజల్లో ఆదరణను కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇప్పుడు ఆయన మరో ప్రచార అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. ఈక్రమంలోనే ఈ నెల 27 నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు.

ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని జగన్ ప్రయత్నిస్తున్నారని వైసీపీ చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సు యాత్రల ప్రజలను కలవబోతున్నారంట సీఎం జగన్. ఇందులో భాగంగా మార్చి 27 నుంచి ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఇలా యాత్రను ప్రారంభించిన తర్వాత వేంపల్లె, విఎన్ పల్లె, పోట్లాడుట్టి మీదుగా పొద్దుటూరు వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రజలకు చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వారికి వివరిస్తారు. ఆ తర్వాత ఆళ్లగడ్డకు చేరుకుంటారు.

అక్కడే రాత్రికి బస చేస్తారు సీఎం జగన్. అయితే ఈ యాత్రలో భాగంగా ప్రజలకు స్పీచ్ లు ఇవ్వడమే కాకుండా.. ప్రజలను, విద్యార్థులను, యువతను, మహిళలను, కార్మికులను, రైతులను ఇలా అందరినీ కలుస్తారు సీఎం జగన్. అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతారు. తన పాలన ఎలా ఉంది అని ప్రశ్నలు అడిగి తెలుసుకుంటారు. తన పాలనపై అభిప్రయాలను తెలుసుకుంటారు సీఎం జగన్. ఎక్కడికక్కడ స్థానికులతో మాట్లాడుతూ… వారి కష్టనష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతారు. అంతే కాకుండా వారి నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటారు జగన్.

జగన్ కు ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అలాంటి జగన్ ఇప్పుడు మళ్లీ ప్రజల్లోకి వస్తే ఈ బస్సు యాత్ర సిద్ధం సభల కంటే పెద్ద సక్సెస్ అవుతుందని అంటున్నారు వైసీపీ నేతలు. ఇక జగన్ కలిసేందుకు వచ్చే అభిమానులకు కూడా సమయం కేటాయిస్తారంట.

ఎవరినీ కించపరచకుండా అందరినీ కలుపుకుని పోతారని చెబుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇలా జగన్ బస్సు యాత్ర ప్రజల్లోకి బలంగా వెళ్తుందని.. సిద్ధం సభలను మించి ఇది నేషనల్ మీడియాలో హైలెట్ అవుతుందని చెబుతున్నారు వైసీపీ వర్గం.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News