Ys Jagan : అద్దంకి సభ సూపర్ సక్సెస్.. ఉప్పెనలా తరలి వచ్చిన జనం..!

Qubetvnews - March 10, 2024 / 08:09 PM IST

Ys Jagan : అద్దంకి సభ సూపర్ సక్సెస్.. ఉప్పెనలా తరలి వచ్చిన జనం..!

Ys Jagan : జగన్ ఎక్కడ సభ పెట్టినా సూపర్ సక్సెస్ అవుతోంది. జగన్ రాక ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ప్రజల్లో తిరుగుతూ తమకు తిరుగులేదని డైలాగులు కొట్టారు. కానీ ఎప్పుడైతే జగన్ ఎంట్రీ ఇచ్చారో వారంతా సైడ్ అయిపోతున్నారు. అసలు జగన్ పెడుతున్న ప్రతి సభ ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్ అవుతున్నాయి. ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడు సభలు సక్సెస్ కాగా.. ఇప్పుడు తాజాగా దెందులూరులో నిర్వహించిన సభ ఆ మూడింటిని మించి సక్సెస్ అయింది. దాంతో ఇప్పుడు ప్రతిపక్షాలు బేజార్ అయిపోతున్నాయి. దెందుళూరు సభకు ప్రజలు ఉప్పెనలా తరలి వచ్చారు.

ఎటు చూసినా రోడ్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రాంగణం నలుదిక్కులా జనాలే. కనుచూపు మేర వైసీపీ నినాదాలతో జనాలే కనిపిస్తున్నారు తప్ప అసలు భూమి మాత్రం కనిపించట్లేదన్నట్టే సభ భారీ సక్సెస్ అయింది. ఇక అక్కడకు వచ్చిన జనాలను ఆకట్టుకునేలా జగన్ ప్రసంగం సాగిపోయింది. వారిని ఏ మాత్రం నిరాశ పరచుకుండా సాగింది. చంద్రబాబు వరుసగా పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నాడు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన జాతీయ పార్టీతో పొత్తుల కోసం ఆరాటపడుతున్నాడంటూ విరుచుకుపడ్డారు. దత్తపుత్రుడు పవన్ చంద్రబాబు ఏం చెబితే అది చేస్తున్నాడంటూ చురకలంటించారు.

సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు పవన్ చేస్తున్నాడని కౌంటర్లు వేశారు. చంద్రబాబుకు పార్టీలు బలం అయితే.. వైసీపీకి ప్రజలే బలం అంటూ హుషారెత్తించారు. ఆకాశంలో చుక్కులు ఎన్ని ఉన్నాయో వైసీపీకి అంత మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు.. ప్రతి ఇంట్లో ఉన్న సామాన్యులే వైసీపీ స్టార్ క్యాంపెయినర్లు అంటూ జోరుగా సాగించారు ప్రసంగాన్ని. అటు ఉత్తరాంధ్ర సిద్ధం, ఉత్తర కోస్తాంధ్ర సిద్ధం, రాయల సీమ సిద్ధం, ఇప్పుడు దక్షిణ కోస్తాంధ్ర సిద్ధమా అంటూ జగన్ పిలుపునిచ్చారు. అంతే కాకుండా సమరానికి సిద్ధమైతే టార్చ్ లైట్లు వెలిగించాలంటూ జగన్ కోరారు.

దాంతో ఆ సభ మొత్తం టార్చ్ లైట్లతో నిండిపోయింది. దాన్ని బట్టి జగన్ మాటలను వారెంతగా ఆచరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు జగన్ చేస్తున్న ప్రసంగాన్ని అక్కడకు వెళ్లిన వారే కాకుండా టీవీలు, యూట్యూబ్ లో కూడా లక్షల మంది వీక్షించారని రిపోర్టులు చెబుతున్నాయి.

దాన్ని బట్టి జగన్ సభలకు ఎంత ఆదరణ దక్కుతుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో వైసీపీకి కచ్చితంగా భారీగా మెజార్టీ సీట్లు వస్తాయని అంటున్నారు రాజకీయ నిపుణులు. ప్రతి సభకు ఒకదాన్ని మించి మరొక సభలు సక్సెస్ కావడమే ఇందుకు నిదర్శనం అని చెబుతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News