Ys Jagan : జగన్ బస్సు యాత్రతో వైసీపీలో పెరుగుతున్న జోష్.. 21 రోజులు జనంలోనే..!
Qubetvnews - March 19, 2024 / 01:26 PM IST
Ys Jagan : సీఎం వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల కోసం అన్ని విధాలుగా ముందే ప్రిపేర్ అవుతున్నారు. ఎన్నికలు వచ్చిన తర్వాత ఆగమయ్యే కంటే.. ఎన్నికలకు ముందే అన్ని విధాలుగా పనులు చక్కదిద్దుకుని ముందుకు వెళ్లిపోతున్నారు. జగన్ ముందే అభ్యర్థులను ప్రకటించడం వల్ల.. ఎన్నికల సమయానికి అసంతృప్త గొడవలు పార్టీలో లేకుండా పోయాయి. ఆయన ఇలాంటి గొడవలు ఉంటాయని ముందే గ్రహించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేనలో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో చూస్తున్నాం. టీడీపీ, జనసేన కూటమి ఇప్పటికీ పూర్తి స్థాయిలో టికెట్లను కేటాయించకుండానే.. ఆ పార్టీల్లో అసంతృప్త గొడవలు పీక్స్ కు వెళ్లిపోతున్నాయి.
కానీ జగన్ పార్టీలో మాత్రం ఇప్పుడు అలాంటి గొడవలు లేవు. పైగా ఇప్పటికే సిద్ధం సభలతో హోరెత్తించారు. పైగా ఇప్పుడు బస్సు యాత్రను స్టార్ట్ చేస్తున్నారు జగన్. ఈ నెల 27 నుంచి బస్సు యాత్రలు చేపట్టబోతున్నారు. వైఎస్సార్ ఘాటు నుంచి ఈ యాత్ర స్టార్ట్ అవుతుంది. దాదాపు 21 రోజులు 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరగనున్నారు సీఎం జగన్. ఈ 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాదాపు 70కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కవర్ అవుతున్నాయి. దాని వల్ల ఒకే సారి అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే నియోజక వర్గాల్లో జగన్ పర్యటించనున్నారన్న మాట.
ఇప్పటి వరకు సిద్ధం సభలను నిర్వహించిన చోట కాకుండా మిగతా నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ వైసీపీ ఇప్పటికే ప్రచారాలు నిర్వహిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటింటి ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. దాంతో ఇప్పుడు ప్రజలతో వైసీపీ బాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అటు టీడీపీ, జనసేన మాత్రం ఇప్పటికీ ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లలేకపోతున్నాయి. మొన్న నిర్వహించిన కూటమి ప్రజాగళం సభ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
పైగా మోడీ కూడా ఇప్పట్లో ఏపీకి వచ్చే అవకాశాలు లేవు. ఎప్పుడో ఏడో విడత సమయంలో వచ్చే ఛాన్స్ ఉంది. అటు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఎటో వెళ్లిపోయింది. లోకేష్ జనాల్లోకి వచ్చి చాలా రోజులు అవుతోంది. చంద్రబాబు ఒక్కడే ఏం చేయాలో అర్థం కాక ఏదో నామమాత్రపు సభలతో కానిచ్చేస్తున్నారు.
చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు అంసతృప్తులను బుజ్జగించేందుకే సమయం సరిపోవట్లేదు. ఇంక వాళ్లు ప్రజల్లోకి వచ్చేలా లేరని వైసీపీ అంటోంది. కాబట్టి ఈ గ్యాప్ లో జగన్ ప్రజల్లో బలంగా ప్రచారం చేసుకుని భారీ సీట్లను సాధిస్తారని అంటున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.
