YS Jagan : విశాఖలో మరోసారి జగన్ రీ సౌండ్.. ఈ సారి వారికి కౌంటర్లు తప్పవా..?

Qubetvnews - February 17, 2024 / 07:24 AM IST

YS Jagan : విశాఖలో మరోసారి జగన్ రీ సౌండ్.. ఈ సారి వారికి కౌంటర్లు తప్పవా..?

YS Jagan :

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీలోని పార్టీలు ఎవరి దారుల్లో వారు బిజీగా ఉంటున్నారు. కానీ ఇంకా కూడా ఎన్నికలకు ఎవరూ సిద్దంగా లేరు ఒక్క జగన్ తప్ప. ఇప్పటికే జగన్ అభ్యర్థులను ప్రకటిస్తూ వరుసగా సభలు ప్లాన్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు. గత పదిహేను రోజుల క్రితమే ఆయన విశాఖకు వచ్చారు. సిద్దం పేరుతో ఆయన పెట్టిన సభ ఎంత గ్రాండ్ గా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు మరోసారి పదిహేను రోజుల వ్యవధిలో జగన్ విశాఖకు రాబోతున్నారు. ఇందుకోసం భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా జగన్ ఎక్కడకు వెళ్లినా సరే అక్కడ ప్రతిపక్షాలను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్రా ముగింపు కార్యక్రమానికి వస్తున్న జగన్.. ఈసారి ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెడుతారని తెలుస్తోంది. ఈ నడుమ చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ సహా షర్మిల కూడా విశాఖలోనే ఎక్కువగా తిరుగుతున్నారు. జగన్ మీద వైసీపీ ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు జగన్ వారికి కౌంటర్లు వేస్తారని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఉత్తరాంధ్రను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తే వారికే అధికారం అనే సెంటిమెంట్ ఉంది.

అందుకే ఈ సారి ఉత్తరాంధ్రకు, మరీ ముఖ్యంగా విశాఖకు ఏం చేశామనేది జగన్ చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రతిపక్షాలకు కౌంటర్లు వేసేందుకు అస్త్రాలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు సీఎం జగన్. మరోసారి విశాఖ వేదికగా రీ సౌండ్ వచ్చేలా ప్రతిపక్షాలకు కౌంటర్లు వేస్తారని తెలుస్తోంది. విశాఖకు అసలు జగన్ ఏమీ చేయలదేని ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. కాబట్టి ఈసారి వారికి చెక్ పెట్టే విధంగా తన మాటల దాడిని జగన్ కంటిన్యూ చేస్తారని అంటున్నారు. పైగా ఇదే వేదికపై నుంచి ప్రతిపక్షాలకు ఏదైనా సవాల్ విసిరే అవకాశం కూడా ఉందంట.

ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి.. ఈ సమయంలో ప్రతిపక్షాల మాయలో ప్రజల పడకుండా చూసుకోవాలన్నది సీఎం జగన్ ప్లాన్. అందుకే అసలు తన పాలన దక్షతలో ఏం జరిగాయన్నది వివరించబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా టీడీపీ హయాంలో జరిగిన లోపాలను కూడా బయట పెట్టబోతున్నారంట జగన్.

ఇలా అటు ప్రతిపక్షాలకు కౌంటర్లు వేస్తూనే.. తన పాలన గురించి చెప్పి మరీ ఈ సభను మరోసారి సక్సెస్ చేసుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా జగన్ ప్రతి సభలో తాను చేసింది, చేయబోయేదాన్ని హైలెట్ చేస్తూ ఓట్లు అడగడం అనేది ఆయన విజ్ఞత అంటున్నారు రాజకీయ నిపుణులు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News