YS Lakshmi : విజయమ్మ పై వివేకా ఎదురు తిరిగితే అప్పుడు బాధ కలగలేదా
Qubetvnews - April 26, 2024 / 10:47 AM IST
YS Lakshmi :
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్ని లేఖల ఎపిసోడ్ మరింత హీటెక్కిస్తోంది. తాజాగా వైఎస్ జగన్ కి బహిరంగ లేఖ రాశారు వైఎస్ వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ. న్యాయం కోసం పోరాటం చేస్తున్నవాళ్ల మీద నిందలు వేస్తున్నారనీ, వివేకా హత్యకు కారణమైన వాళ్లకి మళ్లీ ఎంపీ టికెటివ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారని ఆ లేఖలో విమర్శించింరావిడ. 2009లో జగన్ తన తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించారనీ, 2019లో సునీత కూడా తండ్రిని పోగొట్టుకుని అంతే మనోవేదన అనుభవించారని ఆ లేఖలో రాసుకొచ్చారు సౌభాగ్యమ్మ. మన కుటుంబంలోని వారే హత్యకు కారణం కావడం మరింత బాధపెట్టింది. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నపై నీ పత్రిక, టీవీ ఛానల్, పార్టీ వర్గా చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం చేయించడం నీకు తగునా అంటూ జగన్ ని ప్రశ్నించారు.
ఈ లేఖకి వైయస్ అవినాష్ తల్లి, వైయస్ లక్ష్మి కూడా మరో కౌంటర్ ఉత్తరం రాసి రిలీజ్ చేశారు. అమ్మా.. సౌభాగ్యమ్మ 2009 లో జగన్ తన తండ్రిని కోల్పోయినప్పుడు ఎంతో మనోవేదన అనుభవించాడని ఇప్పుడు గుర్తుకొస్తుందా? 2010 లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ ని చిన్నచూపు చూసినపుడు, జగన్ కి అండగా నిలిచి పెద్ద దిక్కుగా ఉండవలసిన మీరందరూ కలిసి జగన్ ని ఒంటరివాడిగా చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నప్పుడు జగన్ మనోవేదన గుర్తురాలేదా? అని లేఖలో ప్రశ్నించారు.

YS Lakshmi Wrote Counter Letter To YS Sowbhagyamma
వివేకానంద రెడ్డి జగన్ ను సీఎంగా చూడాలని కోరుకున్న మాట వాస్తవం. అలాగే మార్చి 14, 2019 న అవినాష్ ను ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా వాస్తవం. ఈ విషయాన్ని మీ కూతురు సునీతే స్వయంగా మీడియాకు వెల్లడించింది. ఇవాళ మళ్లీ మీరు అదే ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం, సంబంధం లేని వారిని ఈ కేసులో ఇరికించడం మీకు తప్పు అనిపించడం లేదా? ఎవరిని కాపాడుకోవడం కోసం మీరు ఇలా చేస్తున్నారు? హత్యకు కారకులైన వాళ్లు మీతోనే ఉన్నారు. మీలోనే ఉన్నారు.
దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ? నిజం ఎంత లోతులో దాచినా దాగదు. తప్పకుండా బయటపడుతుంది. అంటూ లేఖలో పేర్కొన్నారు వైఎస్ లక్ష్మీ. మరి ఈ కౌంటర్లతో కూడిన ఈ తాజా లేఖకి వైఎస్ సౌభాగ్యమ్మ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో? జగన్ పై ఇంకెన్ని విమర్శనాస్త్రాలు సంధిస్తారో చూడాలి.




