Allu Aravind : గీతాఆర్ట్స్ లో గీత అంటే అల్లు అరవింద్ లవర్ అని మీకు తెలుసా.. అసలు ట్విస్ట్ ఏంటంటే..!

Qubetvnews - February 17, 2024 / 06:59 AM IST

Allu Aravind : గీతాఆర్ట్స్ లో గీత అంటే అల్లు అరవింద్ లవర్ అని మీకు తెలుసా.. అసలు ట్విస్ట్ ఏంటంటే..!

Allu Aravind :

అల్లు అరవింద్.. ఇప్పుడు టాలీవుడ్ ను శాసిస్తున్న పెద్ద నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు. ఎలాంటి సినిమా తీయాలి, ఎలా తీస్తే ప్రేక్షకులకు నచ్చుతుంది అనే విషయాలు అల్లు అరవింద్ కు బాగా తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు సినిమాలపై ఉన్నంత పట్టు ఎవరికీ ఉండదేమో అంటుంటారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. ఇంకొందరు అయితే చిరంజీవికి దగ్గరుండి ఎలాంటి సినిమాలు చేయాలో చెప్పి ఈ రోజు మెగాస్టార్ గా ఉంచారని కొందరు అంటుంటారు. అలాంటి అల్లు అరవింద్ నిర్మాత అయినా కూడా ఆయనకు కూడా చాలా మంది అభిమానులే ఉన్నారు.

ఆయన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అయితే సాధారణంగా ఎవరైనా నిర్మాణ సంస్థలకు తమ ఇంటి పేరు లేదంటే దేవుళ్ల పేర్లు అది కాదంటో వేరే ఇతర పేర్లు పెట్టుకుంటారు. కానీ ఇలా గీతా ఆర్ట్స్ అని పెట్టుకోరు అనే సందేహాలు చాలా మందికి ఉండేవి. ఇంకా చెప్పాలంటే అసలు గీతాఆర్ట్స్ పేరులో ఈ గీత ఎవరు అనే ప్రశ్నలు చాలా మందికి వచ్చే ఉంటాయి. అయితే ఈ పేరు వెనకాల ఉన్న రహస్యాన్ని ఓ సారి చెప్పేశారు అల్లు అరవింద్. ఆయన అలీతో సరదాగా అనే ప్రోగ్రామ్ లో పాల్గొన్నప్పుడు ఈ విషయంపై అలీ నేరుగా ప్రశ్నించారు.

కాగా ఈ విషయంపై అల్లు అరవింద్ కూడా క్లారిటీ ఇచ్చారు. గీత అంటే నా గర్ల్ ఫ్రెండ్ పేరు అని నవ్వేశారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. చాలా మంది ఇలాగే అనుకుంటారు. అందుకే నేను ఈ ఆన్సర్ చెప్పాను. కానీ గీతా ఆర్ట్స్ లో గీత అంటే భగవద్గీత. ఆ భగవద్గీతలో చెప్పినట్టు ప్రయత్నం చేయాలి కానీ ఫలితాన్ని ఆశించకూడదు అనే సిద్దాంతాన్ని నేను బలంగా నమ్ముతాను. సినిమాలు కూడా అంతే. సినిమాలు తీయడం వరకే మన చేతుల్లో ఉంటుంది. ఎలాంటి ఫలితం ఇవ్వాలి అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. అందుకే నేను గీతాఆర్ట్స్ అనే పేరు పెట్టుకున్నాను.

ఓ సారి మా నాన్న రామలింగయ్యతో నేను నిర్మాత అవుతానని చెప్పాను. ఎందుకంటే నటుడిగా ఒకరి కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు. దాంతో ఆయన కూడా ఓకే చెప్పారు. నిర్మాణ సంస్థకు ఏం పేరు పెడుదామని ఆయన తన ఫ్రెండ్స్ తో కలిసి డిస్కర్షన్ చేస్తున్న సమయంలో నేను గీతాఆర్ట్స్ అనే పేరు చెప్పాను.

దాంతో ఆయనకు కూడా అది బాగా నచ్చి అదే పేరు పెట్టారు. అలా 1974లో బంట్రోతు భార్య అనే సినిమాతో నా జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇప్పుడు చిన్న సినిమాలను ప్రోత్సహించడం కోసం గీతాఆర్ట్స్-2 అనే బ్యానర్ ను కూడా కొత్తగా స్టార్ట్ చేశాం. అది కూడా బాగానే నడుస్తోంది అంటూ సీక్రెట్ విషయాలను చెప్పేశారు అల్లు అరవింద్.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News