Allu Aravind : రంగంలోకి అల్లు అరవింద్.. బన్నీ పొరపాటును సరిచేయబోతున్నాడా..?

Qubetvnews - July 1, 2024 / 06:18 PM IST

Allu Aravind : రంగంలోకి అల్లు అరవింద్.. బన్నీ పొరపాటును సరిచేయబోతున్నాడా..?

Allu Aravind : మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి చాలా కాలంగా గ్యాప్ వచ్చింది. అల్లు అర్జున్ కొన్ని సార్లు మెగా ఫ్యాన్స్ ను రెచ్చగొట్టేలా కామెంట్లు చేయడంతో పాటు.. తనకు తానే ఐకాన్ స్టార్ ప్రమోట్ చేసుకోవడం కూడా మెగా ఫ్యామిలీతో గ్యాప్ ను పెంచేసింది. అందుకే అల్లు అర్జున్ ఒకప్పటిలాగా మెగా ఫ్యామిలీతో ఈవెంట్లు జరుపుకోవట్లేదు. ఇక బన్నీ సినిమా ఈవెంట్లకు కూడా మెగా హీరోలు చాలా దూరంగానే ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆ గ్యాప్ ను మరించ పెంచుకున్నాడు అల్లు అర్జున్. మొన్న ఏపీలో ఎన్నికల సమయంలో మెగా హీరోలంతా పవన్ కల్యాణ్‌ కు మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేశారు.

కానీ అల్లు అర్జున్ మాత్రం తన ఫ్రెండ్ అయిన శిల్పా రవికి సపోర్ట్ చేశాడు. శిల్పా రవి వైసీపీ తరఫున పోటీ చేశాడు. రవి ఇంటికి వెళ్లి మరీ మద్దతు ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు జనసైనికులు రగిలిపోయారు. సోషల్ మీడియాలో ఏకి పారేశారు. పవన్ కల్యాణ్‌ కు మద్దతుగా పిఠాపురంకు ఒక్కసారి కూడా అల్లు అర్జున్ రాలేదు. అంతే కాకుండా కనీసం సోషల్ మీడియాలో కూడా పవన్ కు మద్దతుగా పోస్టు పెట్టలేదు. దాంతో మెగా ఫ్యాన్స్ తో పాటు జనసైనికులు బన్నీని పనిగట్టుకుని మరీ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్‌ ఏపీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాడు.

జనసేన పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. దాంతో ఇప్పుడు బన్నీకి సినిమాల్లో ఇబ్బందులు వస్తాయేమో అని అల్లు అరవింద్ ముందుగానే గ్రహించాడు. అందుకే ఇప్పుడు తన కొడుకుకు పవన్ కల్యాణ్‌ మద్దతు కావాలని డిసైడ్ అయ్యాడు. అందుకే స్వయంగా అల్లు అరవింద్ రంగంలోకి దిగాడు. మొన్న ప్రొడ్యూసర్లతో కలిసి పవన్ కల్యాణ్‌ ను అందరికంటే ముందే వెళ్లి కలిశాడు. పవన్ కల్యాణ్‌ కూడా అల్లు అరవింద్ తోనే ఎక్కువగా మాట్లాడాడు. అంతే కాకుండా అల్లు అరవింద్ నిర్మించే సినిమాలకు ఏపీ ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అరవింద్ కోరినట్టు తెలుస్తోంది.

ఇటు మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అరవింద్ మాటను కాదనలేదు. కాబట్టి అరవింద్ స్వయంగా చిరంజీవితో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఈ రకంగా తన కొడుకు భవిష్యత్ కోసం అల్లు అరవింద్ స్వయంగా రంగంలోకి దిగి మరీ అందరినీ కలుపుకుని పోతున్నాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

బన్నీ కూడా అన్నీ గమనిస్తూ ప్రస్తుతానికి సైలెంట్ గానే ఉండిపోతున్నాడని అంటున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు బన్నీలో కూడా మార్పు వచ్చిందని.. మెగా ఫ్యామిలీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. చూడాలి మరి మళ్లీ పాత రోజులు వస్తాయో లేదో.

 

 

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News