Hyper Aadi : అనసూయ జబర్దస్త్ మానేయడానికి అసలు కారణం ఇదా.. బయట పెట్టేసిన హైపర్ ఆది..!
Qubetvnews - February 17, 2024 / 11:14 AM IST
Hyper Aadi :
జబర్దస్త్ ప్రోగ్రామ్ బుల్లితెరపై ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ద్వారాచాలా మంది ఇప్పుడు సెలబ్రిటీలు అయిపోయారు. సుధీర్ లాంటి వారు అయితే ఏకంగా హీరోలుగా మారిపోయారు. కాగా జబర్దస్త్ ద్వారా యాంకర్ గా పరిచయం అయింది అనసూయ. ఆమె జబర్దస్త్ తోనే కెరీర్ స్టార్ట్ చేసింది. జబర్దస్త్ ద్వారా ఎనలేని క్రేజ్ ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే జబర్దస్త్ ద్వారా ఆమె మాస్ యాంకర్ గా మారిపోయింది. కుర్రాళ్లలో విపరీతమైన క్రేజ్ ఆమె సొంత అయిపోయింది. అప్పటి వరకు తెలుగు యాంకర్స్ స్కిన్ షో చేయలేదు.
కానీ అనసూయనే దాన్ని స్టార్ట్ చేసింది. పొట్టి బట్టలు వేసుకుని ఆమె చేసిన గ్లామర్ షోకు అంతా ఫిదా అయిపోయారు. పొట్టిబట్టలు వేసుకుని ఆమె చేసే స్కిన్ షోకు కుర్రాళ్లు మొత్తం ఫ్యాన్స్ అయిపోయారు. దెబ్బకు జబర్దస్త్ నే అందరూ చూడటం స్టార్ట్ చేశారు. అలా క్రేజీ యాంకర్ గా మారిపోయిన అనసూయ చాలా కాలం పాటు అందులోనే కొనసాగింది. అయితే అనుకోకుండా ఆమె జబర్దస్త్ మానేసింది. కారణం ఏంటంటే తాను సినిమాల్లో బిజీ కావడం వల్లనే వదిలేసినట్టు తెలిపింది ఈ ముద్దుగుమ్మ. కానీ మధ్యలో ఇంకోసారి మాట్లాడుతూ తనపై వచ్చే బాడీ షేమింగ్ కామెంట్లను తట్టుకోలేకనే జబర్దస్త్ మానేసినట్టు తెలిపింది.
కొన్ని సార్లు టీఆర్పీ స్టంట్ల కోసం చేసే ఎపిసోడ్స్ తనకు చాలా ఇబ్బంది కరంగా మారాయని.. అందుకే జబర్దస్త్ మానేశానని తెలిపింది అనసూయ. అటు సినిమాల్లో బిజీ అవుతుంది ఓకే. కానీ మధ్యలో స్టార్ మాలో కొన్ని రోజులు సింగింగ్ ప్రోగ్రామ్ కు చేసి చివరకు దాన్ని కూడా మానేసింది. అప్పటి నుంచి ఆమె బుల్లితెరపై కనిపించట్లేదు. కానీ జబర్దస్త్ ఎందుకు మానేసిందనే విషయం ఇప్పటికీ చాలా మందికి ఒక సస్పెన్స్ అనే చెప్పుకోవాలి. అయితే తాజాగా హైపర్ ఆది దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆదిని తాజాగా జోర్దార్ సుజాత ఇంటర్వ్యూ చేసింది.
ఆమె ఇంటర్వ్యకూలో భాగంగా కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు వేసింది. అనసూయ మీ కారణంగానే జబర్దస్త్ మానేసిందంటగా నిజమేనా అని ఆమె అడిగింది. దానికి హైపర్ ఆది కాస్త సీరియస్ గానే సమాధానం చెప్పబోయాడు. కానీ అక్కడితోనే ప్రోమో కట్ అయిపోయింది. ఈ ప్రోమో తాజాగా వైరల్ అవుతోంది.

Hyper Aadi Was Interviewed By Jordar Sujatha
కాగా గతంలో హైపర్ ఆది జబర్దస్త్ లో ఉన్నప్పుడు అనసూయపై చాలా వల్గర్ కామెంట్లు చేస్తూ స్కిట్లలో పెట్టుకునేవారు. అనసూయ, ఆది జోడీకి బాగానే క్రేజ్ ఉండేది. ఏదేమైనా ఇద్దరూ కలిసి చేసిన రచ్చను అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరనే చెప్పుకోవాలి. మరి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.





