Mahesh Babu And Pawan Kalyan : మహేశ్, పవన్ లను స్టార్ హీరోలను చేసిన ఒకే ఒక్క డైరెక్టర్ ఎవరో తెలుసా..?

Qubetvnews - February 17, 2024 / 11:00 AM IST

Mahesh Babu And Pawan Kalyan : మహేశ్, పవన్ లను స్టార్ హీరోలను చేసిన ఒకే ఒక్క డైరెక్టర్ ఎవరో తెలుసా..?

Mahesh Babu And Pawan Kalyan :

ఇప్పుడు టాలీవుడ్ లో పవన్, మహేశ్ బాబు అంటే స్టార్ హీరోలు. ఎవరికీ దక్కనంత క్రేజ్ ఈ ఇద్దరి సొంతం. ఇంకా చెప్పాలంటే మిగతా హీరోల కంటే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు. ఇద్దరి సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక వసూళ్ల విషయంలో కూడా ఎవరికి వారే సాటి అన్నట్టు ఉంటుంది వారి క్రేజ్. ఇద్దరి సినిమాలు వస్తున్నాయంటే మిగతా హీరోలు తప్పుకుని దారి ఇవ్వాల్సిందే. లేదంటే మాత్రం వీరిద్దరి తుఫాన్ ముందు కొట్టుకుని పోతారంతే. ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా ఇప్పుడు తిరుగులేని క్రేజ్ అనుభవిస్తున్న ఈ ఇద్దరినీ ఒకే ఒక్క డైరెక్టర్ స్టార్ హీరోలను చేసి పడేశాడు.

ఆయన ఎవరో కాదండోయ్ పూరీ జగన్నాథ్. అవును మీరు విన్నది నిజమే. పూరీ జగన్నాథ్ తన సినిమాలతో అప్పటి వరకు మామూలు హీరోలుగా ఉన్న వీరిద్దరినీ స్టార్ హీరోలను చేసి పడేశాడు. దెబ్బకు వీరిద్దరూ అగ్ర హీరోలు అయిపోయారు. పూరీ జగన్నాథ్ తన మొదటి సినిమాను పవన్ కల్యాణ్‌ తో తీశాడు. అదే బద్రి సినిమా. అప్పటి వరకు పవన్ హీరోగా ఉన్నాడు తప్ప స్టార్ డమ్ లేదు. అలాంటి సమయంలో ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు పవన్. అతనే పూరీ జగన్నాథ్. అప్పటి వరకు పూరీకి సినిమా తీసిన అనుభవం లేకపోయినా బద్రి సినిమాను తీశాడు.

ఎలా ఉంటుందో అని అందరూ టెన్షన్ పడ్డారు. కానీ విడుదలైన మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్. సినిమా ఎవరూ ఊహించని విధంగా ఉందంటూ కామెంట్లు. ఇంకేముంది ఇండస్ట్రీకి మరో కొత్త స్టార్ హీరో వచ్చాడని అందరూ కితాబు ఇచ్చేశారు. దెబ్బకు పవన్ కల్యాణ్‌ స్టార్ హీరో అయిపోయాడు. ఆ సినిమా తర్వాత పూరీ కొన్ని సినిమాలు చేసి యావరేజ్ హిట్లు అందుకున్నాడు. ఆ సమయంలోనే మహేశ్ బాబుతో ఓ సినిమా కథ చేద్దామన్నాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రతో పోకిరి కథ రాసుకున్నాడు. ఆ కథను ముందు వేరే హీరోలకు వినిపిస్తే వద్దని రిజెక్ట్ చేశారు.

కానీ మహేశ్ కు ఎందుకో కథ పిచ్చ పిచ్చగా నచ్చేసి ఓకే చేశాడు. సినిమా తెరకెక్కిస్తున్నప్పుడే ఇది ఇండస్ట్రీకి రికార్డులను తిరగరాస్తుందని పూరీ జగన్నాత్ చెప్పాడు. ఇక చెప్పినట్టే రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ హిట్ అయింది మూవీ. దెబ్బకు మహేశ్ బాబు పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.

Puri Jagannadh Made Mahesh Babu And Pawan Kalyan Star Heroes

Puri Jagannadh Made Mahesh Babu And Pawan Kalyan Star Heroes

ఓవర్ నైట్ లో సూపర్ స్టార్ అయిపోయాడు మహేశ్ బాబు. పోకిరి అప్పటి వరకు ఉన్న లెక్కలన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఇండస్ట్రీకి మరో పెద్ద హీరో వచ్చాడని గుర్తు చేసింది. అప్పటి నుంచే మహేశ్ బాబు స్టార్ అయిపోయాడు. ఇలా ఇద్దరినీ తన సినిమాలతో స్టార్ ను చేసిన పూరీ.. ఇప్పుడు ప్లాపుల్లో ఉన్నాడు. చూడాలి ఇప్పుడు రామ్ తో చేస్తున్న సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా అనేది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News