Pushpa-2 : బన్నీ పుష్ప-2 కోసం లైన్ క్లియర్ చేస్తున్న త్రివిక్రమ్.. నిజమేనా..?
Qubetvnews - October 15, 2024 / 07:30 PM IST
Pushpa-2 : ఇప్పుడు ఐకాన్ స్టార్ పుష్ప-2 మీదనే అందరి చూపు ఉంది. ఈ సినిమా కోసం బన్నీ అన్ని రకాల ప్లాన్లు వేసుకుంటున్నాడు. అయితే నార్త్ ఇండియాలో, ఇతర స్టేట్స్ లోకంటే కూడా తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్, బిజినెస్ చాలా ముఖ్యం. అందులోనా ఏపీలో బిజినెస్ ఉంటేనే సినిమాకు కలెక్షన్లు వస్తాయి. ఇంతకుమ ముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు నానా ఇబ్బందులు పడ్డారు టాలీవుడ్ సెలబ్రిటీలు. అయితే ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం. పైగా పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ క్రమంలోనే పుష్ప-2 సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడం కష్టం అనే అనుమానాలు మొదలయ్యాయి.
ఎందుకంటే ఇప్పుడు అల్లు వర్సెస్ మెగా వార్ పీక్స్ లో ఉంది. పైగా పవన్ కల్యాణ్ ను ఇప్పటి వరకు బన్నీ కలవలేదు. అందుకే బన్నీని మెగా ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన సినిమాను కూడా టార్గెట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే బన్నీ సినిమా ఎలాగట్టెక్కుతుందా అని ఆలోచిస్తున్న సమయంలో త్రివిక్రమ్ లైన్ లోకి వచ్చినట్టు చెబుతున్నారు. త్రివిక్రమ్ ఇప్పుడు బన్నీతో సినిమాను చేస్తున్నాడు. బన్నీకి, త్రివిక్రమ్ కు మంచి అనుబంధం ఉంది. ఇక టాలీవుడ్ సినిమా బాధ్యతలు మొత్తం అటు ఏపీ ప్రభుత్వంలో పవన్ చూసుకుంటున్నాడు.
ఇక పవన్ సినీ ఇండస్ట్రీ బాధ్యతలు చూసుకునే పనిని త్రివిక్రమ్ కు అప్పగించాడంట. పవన్ కు నమ్మకస్తుడిగా త్రివిక్రమ్ ఉంటున్నారు. అందుకే ఇండస్ట్రీలో ఎవరికి ఏం కావాలన్నా ముందు త్రివిక్రమ్ దగ్గరకు వెళ్తే అప్పుడు పవన్ ఈజీగా స్పందిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. పవన్ తాను ఉన్న బిజీలో ఇండస్ట్రీ సమస్యలు మొత్తం చూసుకోలేడు కాబట్టి త్రివిక్రమ్ ను మధ్యవర్తిగా పెట్టుకున్నాడంట. ఇదే ఇప్పుడు బన్నీకి కలిసి వచ్చింది. ఎలాగూ త్రివిక్రమ్ తో సినిమా ఉంది కాబట్టి.. బన్నీ కోసం త్రివిక్రమ్ పవన్ కు నచ్చజెప్పే పనిలో పడ్డారంట.
ఎంత కాదన్నా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఇప్పటికీ కలిసే ఉంది. ఏవో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నంత మాత్రాన పవన్ అంత బెట్టు చేయకపోవచ్చు అంటున్నారు. పైగా పవన్ ను ఎలా ఒప్పించాలో త్రివిక్రమ్ కు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ ద్వారా పుష్ప-2 కోసం ఏపీలో అన్నీ క్లియర్ చేసుకుంటున్నాడంట బన్నీ.
