Pawan Kalyan : పవన్ కు పబ్లిసిటీనే ముఖ్యం.. ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేనట్టుందే..!
Qubetvnews - February 17, 2024 / 07:16 AM IST
Pawan Kalyan :
పవన్ కల్యాణ్ ఎప్పుడు బయటకు వస్తాడో.. ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఏదో మూడు నెలలకు ఓ సారి అలా బయటకు వచ్చి నాలుగు సినిమా డైలాగులు కొట్టి.. ట్విట్టర్ లో నాలుగు ట్వీట్లు పెట్టేసి వెళ్లిపోవడం పవన్ కల్యాణ్ కు అలవాటే అని వైసీపీ నేతలు నిత్యం చెబుతూనే ఉన్నారు. పవన్ కల్యాన్ కూడా అందుకు తగ్గట్టే ట్వీట్లు చేస్తూ వస్తున్నారు తప్ప ఎక్కడా కూడా తన లక్ష్యాన్ని బయట పెట్టట్లేదు. అసలు ప్రజలపై చిత్తశుద్ధి ఉన్న నాయకుడు అయితే నిత్యం ప్రజల్లోనే ఉంటాడు. అంతే తప్ప కలవడానికి సాకులు చెప్పుకోడు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం నిత్యం ఇలాంటి సాకులతోనే గడిపేస్తున్నాడని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
పవన్ కల్యాణ్ ఎప్పుడు బయటకు వచ్చినా సరే ఆయన ముఖ్యంగా పబ్లిసిటీ మాత్రమే చూసుకుంటారు. అది ఆయనకు మొదటి నుంచి అలవాటే. ఇప్పుడు భీమవరానికి వస్తున్నట్టు జనసేన వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 14న ఆయన భీమవరం ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ హెలిప్యాడ్ కు అనుమతి ఇవ్వట్లేదంటూ వైసీపీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆర్ అండ్ బీ అధికారులు హెలిప్యాడ్ కు అనుమతి ఇవ్వలేదు. దాన్ని కూడా వైసీపీ మీద విమర్శలకు మార్చుకుంటున్నారు జనసేన నేతలు. అసలు పవన్ కల్యాణ్ కు నిజంగా కలవాలని ఉంటే హెలిప్యాడ్ పర్మిషన్ లేకపోతే వేరే మార్గమే లేదా అని వైసీపీ నేతలు అడుగుతున్నారు.
ఎందుకంటే పవన్ కల్యాణ్ ఉన్నది పక్కనే ఉన్న విజయవాడలో. కాబట్టి కారులో కూడా వెళ్లొచ్చు కదా.. ఆ మాత్రం దానికి హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వట్లేదని ఎందుకు అంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ కు నిజంగా చిత్తశుద్ధి ఉండి.. ప్రజలను కలిసి వారి సమస్యలపై పోరాడాలి అనుకుంటే హెలిక్యాప్టర్ రావట్లేదు.. విమానం ఇవ్వట్లేదు అని ఎందుకు అంటున్నారు అంటూ అడుగుతున్నారు వైసీపీ నేతలు. అది కూడా నిజమే కదా అని కొందరు నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే విజయవాడ నుంచి భీమవరానికి వెల్లడానికి పెద్ద ఇబ్బందేమీ లేదు.
కారులో కూడా ఈజీగా వెళ్లిపోవచ్చు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న పవన్ క ల్యాణ్కు.. పక్కనే ఉన్న భీమవరానికి వెల్లేందుకు పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు. కానీ హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వట్లేదని చెబుతున్నారంటే ఆయన పర్యటనలో పబ్లిసిటీ మాత్రమే ఉంది తప్ప ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి కనిపించట్లేదని కామెంట్లు పెడుతున్నారు.
పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. కానీ ఎక్కడ ముందే చెప్పేస్తే జగన్ ఏం చేస్తాడో అనే భయం పవన్ కల్యాణ్ లో స్పష్టంగా కనిపిస్తోందని వైసీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. అందుకే పవన్ కల్యాణ్ దాచి పెట్టి ఇలా పబ్లిసింటీ స్టంట్లు వేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.




