BRS : ఆ విషయంలో బీఆర్ఎస్ సక్సెస్ అయిందా.. క్రెడిట్ ఎవరికి..?

Qubetvnews - February 17, 2024 / 07:26 AM IST

BRS : ఆ విషయంలో బీఆర్ఎస్ సక్సెస్ అయిందా.. క్రెడిట్ ఎవరికి..?

BRS :

కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు పోరాటం అంటే మహా ఇష్టం. ఏ విషయంపై అయినా రచ్చ రచ్చ చేసేసి దాని గురించే జనాలు మాట్లాడుకునేలా చేయడంలో ఆయన దిట్ట. అందుకే కేసీఆర్ కు అపర చాణక్యుడు అనే బిరుదును రాజకీయాల్లో ఇచ్చేశారు. అలాంటి కేసీఆర్ గత పదేండ్లుగా అధికారంలో ఉన్నారు. కాబట్టి ఆయన పోరాట పటిమ ఇన్ని రోజులు ఎవరికీ కనిపించలేదు. కాగా ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. మొన్నటి వరకు తుంటి కాలు ఆపరేషన్ తో రెస్ట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు కోలుకున్నారు కాబట్టి బయటకు రావాలని డిసైడ్ అయ్యారు.

అయితే ఆయన బయటకు వస్తూనే తన పోరాటాన్ని మరోసారి నిరూపించుకోవాలని డిసైడ్ అయ్యారు. కృష్నా నదిపై కట్టిన ప్రాజెక్టులను కేఆర్ ఎంబీకి అప్పగిస్తుందన్నది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. దాన్ని బేస్ చేసుకుని ఛలో నల్గొండ సభను ప్లాన్ చేశారు సీఎం కేసీఆర్. ఆ సభలో కృష్నానదిపై ఉన్న ప్రాజెక్టుల వివరాలను.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన వాటిని.. అలాగే తమ పోరాటాన్ని మరోసారి గుర్తు చేయబోతున్నారు. అంతే కాకుండా కేఆర్ ఎంబీకి అప్పగించవద్దని ఆయన డిమాండ్ చేయబోతున్నారు. మరి ఈ విషయాన్ని పసిగట్టిన కాంగ్రెస్ ఊరుకుంటుందా.

పైగా అక్కడ సీఎంగా ఉన్నది రేవంత్ రెడ్డి. ముందస్తు వ్యూహాలతో ఎప్పటికప్పుడు అలెర్ట్ గా ఉండే రేవంత్ ఈ విషయంలో మాత్రం మౌనంగా ఎందుకు ఊరుకుంటారు. ఆ క్రెడిట్ కేసీఆర్ కు ఎందుకు పోనిస్తారు.. అందుకే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేఆర్ ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేది లేదని కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన తీర్మానానికి తప్పనిసరిగా బీఆర్ఎస్ కూడా మద్దతు తెలపాల్సి వచ్చింది. అయితే ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మార్చేసుకుంది బీఆర్ ఎస్. సభలో హరీశ్ రావు దానికి అనుకూలంగా మాట్లాడారు.

మొన్ననే బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు బడ్జెట్ మీదనే సమావేశాలు జరపాల్సి ఉండేది. కానీ బడ్జెట్ ను పక్కన పెట్టేసి ఇప్పటికిప్పుడు కేఆర్ ఎంబీకీ ప్రాజెక్టులు అప్పగించొద్దు అనే ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశ పెట్టడానికి కారణం కేసీఆర్ నల్గొండ సభనే అంటూ హరీశ్ రావు బల్లగుద్ది మరీ చెప్పేశారు.

ఇదే అంశాన్ని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. తాము ఛలో నల్గొండ సభను పెట్టకపోతే అసలు కాంగ్రెస్ దానిపై ఏకగ్రీవ తీర్మానం పెట్టేది కాదంటూ చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇలా మొత్తానికి తమ వల్లే సభ ఇలా ఏకగ్రీవ తీర్మానం పెట్టిందని.. కాబట్టి ఈ క్రెడిట్ తమదే అని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News