T-SAT CEO : టి-సాట్ సీఈవో గా బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్ రెడ్డి..!

Qubetvnews - March 11, 2024 / 06:24 PM IST

T-SAT CEO : టి-సాట్ సీఈవో గా బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్ రెడ్డి..!

T-SAT CEO : తెలంగాణ స్కిల్, అకడమిక్ అండ్ ట్రైనింగ్ టి-శాట్ సీఈవోగా సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన సోమవారం నాడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మిడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఐటీ శాఖ అదనపు కార్యదర్శి కిరణ్ కుమార్, ఇతర సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో హైదరాబాద్ మెయిన్ ఆఫీసులో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంఆ బాధ్యతలు తీసుకున్న వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ మంత్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకి కృతజ్ణతలు తెలియజేసారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే విధంగా సహకరిస్తానని తెలిపారు. అంతే కాకుండా టి శాట్ నెట్ వర్క్ ను జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా నిలుపుతానని వివరించారు. ఇప్పుడున్న రంగాలతో పాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో టిశాట్ ను తీసుకెళ్లి మరింత విస్తరిస్తానని తెలిపారు వేణుగోపల్ రెడ్డి. ప్రస్థుతం నడుస్తున్న నిపుణ, విద్య చానళ్లకు అదనంగా మరిన్ని చానళ్లను సైతం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు.

సంస్థలో పని చేసే ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోతానంటూ వివరించారు. మొన్నటివరకూ టి-సాట్ సీఈవోగా పనిచేసిన శైలేష్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల కోసం నిత్యం పని చేసిన వేణుగోపాల్ రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల తాను సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వేణుగోపాల్ రెడ్డి ఈ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. ప్రధానంగా వ్యవసాయం, రైతులు, గ్రామీణులకు మరియు వైద్యానికి సంబంధించిన అంశాలను టి-సాట్ మాధ్యమం ద్వారా చేరవేయాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డితో పాటు తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ఐటీ శాఖ అదనపు కార్యదర్శి కిరణ్ కుమార్, అంబేద్కర్ యూనివర్శిటి రిజిస్ట్రార్ ఎవిఆర్ఎన్ రెడ్డి, తెలంగాణ మాస పత్రిక ఎడిటర్ కోడూరు శ్రీనివాసరావ్, టీయూడబ్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహాత్ అలీ, మైక్ టీవీ ఛైర్మన్ అప్పిరెడ్డి, సీఈవో సతీష్, జనంసాక్షి ఎడిటర్ రహమాన్, ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, బిగ్ టీవీ చీఫ్ ఎడిటర్ పీవీ శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు సారథి, సూరజ్, బుచ్చన్న, సాధిక్, పరిపూర్ణా చారి, సీఈవో కుటుంబ సబ్యులు, టి-సాట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News