Kcr : వెళ్లిపోయే వారికి టికెట్లు.. కేసీఆర్ మాస్టర్ స్కెచ్..!

Qubetvnews - March 14, 2024 / 09:30 AM IST

Kcr : వెళ్లిపోయే వారికి టికెట్లు.. కేసీఆర్ మాస్టర్ స్కెచ్..!

Kcr : కేసీఆర్ కు ఎవరికి ఎలా కలుపుకుని పోవాలో.. ఎవరిని ఎలా ఒప్పించాలో బాగా తెలుసు. తనకు అపోజిట్ గా ఉన్న లీడర్లతో కూడా జై కొట్టించుకోవడంలో కేసీఆర్ చాలా దిట్ట. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. పైగా రాజకీయాల్లో ఆరు తేరిన నేతగా పేరున్న కేసీఆర్ కు ఇలాంటివి కొత్తేం కాదు. అయితే ఇప్పుడు కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ ఎస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

దాంతో చాలా మంది ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిపోయారు. మొదట్లో పార్టీని వీడే వారిని కేసీఆర్ లైట్ తీసుకున్నారు. కానీ ఇలీ లీడర్లు వెళ్లిపోతే పార్టీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతోందని కేసీఆర్ అంచనా వేశారు. అందుకే ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో తన పార్టీ నుంచి లీడర్లు వెళ్లిపోకుండా చూసుకునేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. అందుకే ఈ సారి పార్టీ నుంచి వెళ్లిపోవాలి అనుకున్న వారిని స్వయంగా తన వద్దకు పిలిపించుకుని మాట్లాడుతున్నారు కేసీఆర్. వారికి స్పష్టమైన హామీలు ఇచ్చి మరీ వారిని వెళ్లిపోకుండా చూసుకుంటున్నారు.

ఇందులో భాగంగానే కొందరు బడా లీడర్లకు ఎంపీ టికెట్లు కేటాయిస్తున్నారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో చూసుకుంటే.. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఎంపీ స్థానాలు ఉన్నాయి. అయితే ఖమ్మం, మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, మాలోత్ కవితలు పార్టీని వీడి వెళ్లిపోతారనే టాక్ మొన్నటి వరకు నడిచింది. దాంతో ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ వారికి మళ్లీ ఎంపీ టికెట్లు కేటాయించారు. దాంతో వారు బీఆర్ ఎస్ లోనే ఉండిపోయారు. అటు మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ లోకి వెళ్లిపోతారనే టాక్ వినిపించింది.

దాంతో ఆయన కూతురు కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించారు. దాంతో కడియం కూడా ఇప్పుడు కేసీఆర్ కు జై కొడుతున్నారు. అక్కడి నుంచి ప్రస్తుత ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ కు వేరే పోస్టు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్. అంతే కాకుండా అటు చేవెళ్ల నుంచి ఎన్నికల ముంగిట టీడీపీ నుంచి చేరిన కాసానికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది.

సిటింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ఇలా కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో బలమైన లీడర్లను కాపాడుకుంటున్నారు. ఇది ఆయనకు ఇప్పుడు అవసరమే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కేసీఆర్ ముందే ఇలాంటి పనులు చేసి ఉంటే ఈ పాటికి పార్టీ నుంచి ఎవరూ వెళ్లిపోకుండా చూసుకునే వారు కాబోలు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News