Revanth Reddy : ఆ విధంగా హిస్టరీ రిపీట్ చేయబోతున్న రేవంత్..?

Qubetvnews - March 21, 2024 / 09:32 AM IST

Revanth  Reddy :  ఆ విధంగా హిస్టరీ రిపీట్ చేయబోతున్న రేవంత్..?

Revanth Reddy : రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రధానంగా బీఆర్ ఎస్ మీదనే ఫోకస్ పెడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు పోటీ అంటే కేవలం బీఆర్ ఎస్ పార్టీ మాత్రమే అని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. అందుకే ఇప్పుడు బీఆర్ ఎస్ అడ్రస్ లేకుండా పోతేనే.. రాబోయే పదేండ్లు తనకు తిరుగు ఉండదని రేవంత్ ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు కేసీఆర్ గతంలో కాంగ్రెస్ మీద వాడిన అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు రేవంత్ రెడ్డి. వాస్తవానికి బీఆర్ ఎస్ ను ఏ విధంగా దెబ్బ కొట్టాలనేది ఇప్పుడు రేవంత్ ముందున్న ఎత్తుగడ. రాజకీయాల్లో ఒక పార్టీని దెబ్బ కొట్టాలంటే.. ఆ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి.

అప్పుడే ఆ పార్టీ పట్ల ప్రజల్లో గ్రాఫ్ పడిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే పని చేస్తున్నారు. బీఆర్ ఎస్ మీద ప్రజల్లో ఉన్న సానుకూలతను పూర్తి స్థాయిలో దెబ్బ తీసే కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే.. ముందు కాళేశ్వరం మీద ఫోకస్ పెట్టారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ పెద్ద ఎత్తున దానిపై చర్చ లేపారు. అంతే కాకుండా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మేడిగడ్డ సందర్శన ఇలాంటివన్నీ కూడా బీఆర్ ఎస్ మీద వ్యతిరేకతను తీసుకురావడంలో సక్సెస్ అయిపోయాయి.

దాంతో ఇప్పుడు బీఆర్ ఎస్ నేతల్లో కూడా ఆ పార్టీ మీద నమ్మకం తగ్గిపోతోంది. దాంతో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు కూడా ఆ పార్టీని వీడిపోతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, టికెట్ రాని వారు అందరూ కూడా కాంగ్రెస్ బాట పడుతున్నారు. అయితే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు. ఇందుకోసం తాజాగా ఆయన గేట్లు తెరిచామని.. త్వరలోనే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ లోకి వచ్చేస్తారని తెలిపారు రేవంత్ రెడ్డి. కాగా దీనికి ఓ కారణం కూడా ఉందని తెలుస్తోంది.

కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ ఎస్ లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ ఎల్పీ అప్పుడు బీఆర్ ఎస్ లో విలీనం అయిపోయింది. దాంతో అప్పుడు కాంగ్రెస్ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేయబోతున్నారని తెలుస్తోంది.

ఎంపీ ఎన్నికల తర్వాత దాదాపు 20 మందికి పైగా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. ఇప్పటికే వారితో చర్చలు పూర్తయ్యాయని.. త్వరలోనే వారంతా కూడా కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. గతంలో సీఎల్పీని బీఆర్ ఎస్ లో విలీనం చేసుకుంటే.. ఇప్పుడు బీఆర్ ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో రేవంత్ విలీనం చేసుకోబోతున్నారన్న మాట.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News